New Year Celebrations: ఇలా చేస్తే ఎంత తాగినా పోలీసులకు దొరకరు..
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:51 AM
మద్యం ప్రియులకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వెరీ స్పెషల్. తాగిన తర్వాత కొందరు రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేయడం, లేదా సొంత వాహనాలను నడుపుకుంటూ వెళ్లి పోలీసులకు దొరకిపోతుంటారు. ఈ క్రమంలో మద్యంపై మక్కువతో ఎక్కువ తాగినా పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే జనం సెలబ్రేషన్స్ మూడ్‌లోకి వెళ్లిపోతున్నారు. ఆఫీసులకు వెళ్లిన వాళ్లంతా టైమ్ ఎంత త్వరగా అవుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు. మద్యం ప్రియులకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వెరీ స్పెషల్. సంవత్సరంలో ఆఖరిరోజు కావడంతో.. ఈ ఏడాదికి ఇదే లాస్ట్ అంటూ మద్యం ప్రియులు ఎక్కువగా తాగుతుంటారు. తాగిన తర్వాత కొందరు రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేయడం, లేదా సొంత వాహనాలను నడుపుకుంటూ వెళ్లి పోలీసులకు దొరకిపోతుంటారు. సాధారణంగా మద్యం అధికంగా తాగడం ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ లిక్కర్ తాగే అలవాటున్నవాళ్లు త్వరగా దానిని మానలేరు. మద్యానికి దూరంగా ఉండమని ఎంత సూచించినా డిసెంబర్ 31 రాత్రి అప్పుడప్పుడు మద్యం తాగే అలవాటున్నవాళ్లు సైతం కనీసం ఒకట్రెండు పెగ్‌లైనా తాగకుండా ఉండలేరు. మద్యం తాగి బయటకువస్తే పోలీసులకు దొరికిపోతారు. ఇంట్లో వేడుకలు చేసుకుని బయటకురానివారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం బయట న్యూఇయర్ వేడుకలకు హాజరై మద్యం తాగి తమ వాహనాలను తాము డ్రైవ్ చేస్తూ వెళ్తేనే ప్రమాదం. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఘటనలను నియంత్రించడానికి పోలీసులు సైతం ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మద్యంపై మక్కువతో ఎక్కువ తాగినా పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇంట్లోనే బెటర్..
మద్యం ఎక్కువుగా తాగే అలవాటు ఉన్నవాళ్లు ఇంట్లోనే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎక్కడైనా ఈవెంట్స్‌కు వెళ్తే ఇంటికి వచ్చే సమయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మద్యం కోటా ఎక్కువైనా స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం లేకపోలేదు. కొందరు మందు ఎక్కువై కక్కుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లోనే ఉండి మద్యం తాగినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఏదైనా ఇబ్బంది ఎదురైనా మనచుట్టూ కుటుంబ సభ్యులు ఉండటంతో కొంచెం ధైర్యంగా ఉంటుంది.
తప్పని పరిస్థితుల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బెటర్..
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయటకు వెళ్లాల్సి వస్తే మద్యం తాగిన వ్యక్తులు.. ఇంటికి చేరు సమయంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించడం లేదా తమ వాహనాలను తాగని వ్యక్తులు నడిపేలా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. అవసరం అనుకుంటే డ్రైవర్‌ను పెట్టుకోవడం మంచిది. క్యాబ్ సర్వీసులు ప్రస్తుతం పట్టణాల్లో సైతం అందుబాటులోకి రావడంతో ఎవరైనా ఎక్కువగా తాగి ఇంటికి చేరుకోవడానికి ప్రైవేట్ క్యాబ్‌లను ఉపయోగించుకోవచ్చు.
తాగిన తర్వాత అక్కడే..
ఎవరైనా రాత్రి పార్టీకి హాజరై ఎక్కువుగా తాగితే అక్కడినుంచి అర్థరాత్రి సమయంలో ఇంటికి రాకుండా పార్టీకి వెళ్లిన ప్లేస్‌లనే స్టే చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు.