Food Hacks: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కంగారు పడక్కర్లేదు.. ఈ టిప్స్ తో ఉప్పు తగ్గించేయచ్చు..!
ABN , Publish Date - Jun 13 , 2024 | 12:05 PM
కొన్నిసార్లు వంటల్లో ఉప్పు ఎక్కువ పడుతూ ఉంటుంది. కొద్దిగా ఉప్పు ఎక్కువైతే పర్లేదని సర్దుకుంటాం. కానీ ఉప్పు మరీ ఎక్కువగా ఉంటే ఆ వంట అస్సలు తినలేం. అలాగని చూస్తూ వంటను చెత్త బుట్ట పాలు చెయ్యనూలేం. ఇలా బాధపడే వారికోసం కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి.
వండుకోవడం, తినడం ప్రతి ఇంట్లో కామన్. అయితే కొన్నిసార్లు వంటల్లో ఉప్పు ఎక్కువ పడుతూ ఉంటుంది. కొద్దిగా ఉప్పు ఎక్కువైతే పర్లేదని సర్దుకుంటాం. కానీ ఉప్పు మరీ ఎక్కువగా ఉంటే ఆ వంట అస్సలు తినలేం. అలాగని చూస్తూ వంటను చెత్త బుట్ట పాలు చెయ్యనూలేం. ఇలా బాధపడే వారికోసం కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఈ టిప్స్ ను ఫాలో అయితే వంటల్లో ఉన్న అదనపు ఉప్పును తొలగించేయవచ్చు. వంటను ఎప్పటిలాగే ఆస్వాదించవచ్చు. వంటల్లో ఉప్పు తొలగించే ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో పచ్చి బంగాళాదుంప ముక్కలు వేయాలి. 20 నిమిషాల పాటూ అలాగే వదిలేయాలి. ఈ సమయంలో బంగాళాదుంప ముక్కలు కూరలో ఉన్న అదనపు ఉప్పును పీల్చేస్తాయి.
ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..!
బియ్యం పిండి బాల్స్ కూడా అదనపు ఉప్పు తొలగించడంలో సహాయపడతాయి. బియ్యం పిండిని బాల్స్ చేసి కూరల్లో వేయాలి. కొద్దిసేపటి తరువాత ఈ బాల్స్ తీసేయాలి. ఇవి కూరల్లో అదనపు ఉప్పు పీల్చుకుని కూరలో ఉప్పును తగ్గిస్తాయి.
కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు సింపుల్ గా ఫాలో అయ్యే చిట్కా ఒకటి ఉంది. కూరల్ల ఒక స్పూన్ పెరుగు వేసి కొద్దిసేపు కూరను ఉడికించాలి. ఇలా చేస్తే ఉప్పు కంట్రోల్ లోకి వస్తుంది.
వంటల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో 2 స్పూన్ల పాలు జోడించాలి. ఇలా చేస్తే అదనపు ఉప్పు తొలగిపోతుంది.
కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఉల్లిపాయ ద్వారా ఉప్పును నియంత్రణలోకి తీసుకురావచ్చు. ఉల్లిపాయను పచ్చిగా లేదా వేయించి కూరల్లో కలపాలి. తరువాత దీన్ని ఓ 5 నిమిషాల పాటూ ఉడికించాలి. ఇలా చేస్తే ఉప్పు సమం అవుతుంది.
వంటల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ వెనిగర్ కలపాలి. ఉప్పుకు తగ్గట్టు కారం, పులుపు , తీపి సర్దుబాటు చేయడం వల్ల ఉప్పు కూడా సమం అవుతుంది.
ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..!
ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగితే.. ఈ 5 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.