Share News

Viral: ఎవరూ పెళ్లాడని యువతికి కొత్త జీవితం ఇచ్చాడు.. ఈ డాక్టర్ నిజంగా దేవుడే!

ABN , Publish Date - May 07 , 2024 | 05:18 PM

పైపైమెరుగులకే జైకొట్టే లోకంలో మనసుకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అంతటి మంచి మనసు ఉన్న ఓ డాక్టర్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ఎవరూ పెళ్లాడని యువతికి కొత్త జీవితం ఇచ్చాడు.. ఈ డాక్టర్ నిజంగా దేవుడే!
Doctor marries woman with spots on face

ఇంటర్నెట్ డెస్క్: పైపైమెరుగులకే జైకొట్టే లోకంలో మనసుకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అంతటి మంచి మనసు ఉన్న ఓ డాక్టర్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఆ డాక్టర్‌ను పెళ్లాడిన యువతే స్వయంగా ఈ విషయాలు పంచుకుంది. ఆమె జీవితంలో వెలుగులు నింపిన డాక్టర్‌పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

makeupartistrybyanupreet అనే ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలోని యువతి చెప్పిన దాని ప్రకారం, ఆమె శరీరమంతా కురుపులు రావడంతో అందవిహీనంగా మారింది. దీంతో, ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ వెనక్కు వెళ్లిపోయాయి. చివరకు తనకు పెళ్లి కాదేమోనన్న బెంగ ఆ యువతిని కుంగదీసింది. అలాంటి తరుణంలో ఓ డాక్టర్ ఆమెకు అండగా నిలిచాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చాడు. ‘‘నేను ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకోబోతున్నాను’’ అంటూ యువతి సంతోషం పట్టలేక కన్నీటి పర్యంతమైంది (Girl With Spots On Face Gets Married To Doctor After Multiple Rejections).

Viral: ఇంట్లో సీక్రెట్‌గా సీసీటీవీ కెమెరా పెట్టిన భర్త.. బయటపడ్డ వివాహిత దారుణాలు!


ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియరానప్పటికీ ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మంది హృదయాలను కదిలించింది. రూపురేఖలకు కాకుండా మనసుకు ప్రాధాన్యం ఇచ్చిన డాక్టర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. యువతి నూతన జీవితం సుఖవంతంగా సాగాలని అనేక మంది ఆకాంక్షించారు.

ఇటీవల కర్ణాటకలో వెలుగు చూసిన మరో ఉదంతంలో..మేకప్ వికటించి వధువు ముఖం అందవిహీనంగా మారడంతో డాక్టర్ వరుడు పెళ్లి రద్దు చేసుకున్నాడు. పెళ్లికి ముందు బ్యూటీ పార్లర్‌కు వెళ్లి మేకప్ చేయించుకుని వచ్చిన యువతి పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మేకప్ వికటించి ఆమె ముఖం నల్లగా మారిపోయింది. దీంతో, ఆ వరుడు మరో ఆలోచన లేకుండా పెళ్లి రద్దు చేసుకున్నాడు.

Read Viral and Telugu News

Updated Date - May 07 , 2024 | 05:22 PM