Share News

Palm payment: వామ్మో..యూపీఐని మించిపోయే టెక్నాలజీ.. చైనాలో కొత్త ఆవిష్కరణ

ABN , Publish Date - Apr 02 , 2024 | 10:00 PM

చైనాలో కొత్త పేమెంట్ చెల్లింపుల టెక్నాలజీ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Palm payment: వామ్మో..యూపీఐని మించిపోయే టెక్నాలజీ.. చైనాలో కొత్త ఆవిష్కరణ

ఇంటర్నెట్ డెస్క్: మనందరికీ ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్ పే వంటివి అలవాటైపోయాయి. కానీ వీటిని వాడుకోవాలంటే స్మార్ట్ ఫోన్, పాస్‌వర్డ్ వంటివి తప్పనిసరి. చైనాలోనూ ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ప్రస్తుతం అంతకుమించిన ఆవిష్కరణతో చైనా ముందుకొచ్చింది. చైనా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వీచాట్ మాతృసంస్థ టెన్సెంట్ (Tencent) దీన్ని తాజాగా ప్రయోగాత్మకంగా విడుదల చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.

Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..


వీచాట్ అకౌంట్ ఉన్న సబ్‌వే రైలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఈ వ్యవస్థలో కేవలం అరిచేయి చూపించి చెల్లింపులు జరపవచ్చు. పదే పదే స్మార్ట్ ఫోన్ వినియోగించాల్సిన అవసరం లేకుండా ఈ విధానాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా వినియోగదారులు ముందుగా తమ అరచేయిని వీచాట్ యంత్రం ద్వారా తమ చెల్లింపుల అకౌంట్‌కు అనుసంధానం చేసుకోవాలి. ఆ తరువాత సబ్‌వే స్టేషన్ లోపలికి వేళ్లేటప్పుడు గేట్ వద్ద ఉన్న స్కానర్‌కు అరచేయి చూపిస్తే వీచాట్ అకౌంట్లోంచి టిక్కెట్ ధర కట్ అయిపోతుంది. ఈ విధానంలో అరచేయి ద్వారా చెల్లింపు చేస్తుండటంతో దీన్ని పామ్ పేమెంట్ (Palm Payment) అని పిలుస్తున్నారు.

Viral: ఈ పెద్దాయనను చూడండి! వీధుల్లో ట్రాఫిక్ పోలీసులు ఎదురుపడితే..


ప్రస్తుతం ఇది సబ్‌వే ప్రయాణ టిక్కెట్ల చెల్లింపులకే అందుబాటులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇది రెస్టారెంట్లు, షాపులు, ఇతర ప్రదేశాల్లో వినియోగించే అవకాశం కూడా ఉంది. చెల్లింపులు మరింత సులభతరం చేసేందుకు ఈ టెక్నాలజీని సిద్ధం చేసినట్టు వీచాట్ మాతృ సంస్థ టెన్సెంట్ పేర్కొంది. ఇది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కంటే చవకైన భద్రమైన సాంకేతికత అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అరచేయి గుర్తులతో పాటు చేయిలోని నరాల అల్లికను పరిగణలోకి తీసుకోవడంతో ఈ డాటా హ్యాక్ చేయడం అంత సులభం కాదని అంటున్నారు.

Viral: ప్రతి ఆసుపత్రిలో ఇలాంటి నర్సు ఉంటేనా.. వైరల్ వీడియో!

Viral: కూతురు లండన్ నుంచి విదేశీ ప్రియుణ్ణి ఇంటికి తీసుకొస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 10:04 PM