Viral Video: రైలు విండోలో నుంచి జారీ పడిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ABN , Publish Date - Oct 15 , 2024 | 05:57 PM
కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఎమర్జెన్సీ కిటికి తీసి ఉండడంతో.. వేగంగా వెళ్తున్న రైలులో నుంచి ఆ పాప కిందకి పడిపోయింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై..రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. పాపను ప్రాణాలతో రక్షించారు.

Also Read: వయనాడ్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన సీఈసీ
ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మథురకు ఓ కుటుంబం రైలులో బయలుదేరింది. వీరు ప్రయాస్తున్న బోగీలోని ఎమర్జెన్సీ కిటికి వద్ద ఎనిమిదేళ్ల చిన్నారితో కలిసి తల్లిదండ్రులు కూర్చున్నారు. అయితే వెంటిలేషన్ కోసం సహచర ప్రయాణికులు ఆ ఎమర్జెన్సీ విండోను తెరిచారు.
Also Read: ట్రాఫిక్‌లో చిక్కుకున్నారా? ఇలా చేయండి.. జస్ట్ సెకన్‌లో పోలీసులు మీకు ఫోన్ చేస్తారు..?
అయితే రైలు వేగంగా వెళ్తున్న సమయంలో.. ఎనిమిదేళ్ల చిన్నారి ఆ ఎమర్జెన్సీ కిటికి నుంచి జారీ కింద పడిపోయింది. దీంతో వెంటనే ఆ పాప తండ్రి సమీపంలోని లలిత్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఝాన్సీ రైల్వే పోలీసులతోపాటు ఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో వారంత బృందాలుగా విడిపోయి.. గాలింపు చర్యలు చేట్టారు.
Also Read: పండగ వేళ.. పలు ప్రత్యేక రైళ్లు
చివరకు దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్ పక్కనున్న పొదల్లో స్పృహ తప్పి పడిపోయి ఉన్న పాపను ఆయా బృందాలు గుర్తించాయి. అనంతరం ఆ పాపను లలిత్‌పూర్‌కు తరలించారు. అక్కడి ఆసుపత్రిలో ఆ పాపకు చికిత్స అందించారు. అందుకు సంబంధించిన వీడియోను యూపీ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు తమ కుమార్తెను కాపాడిన యూపీ పోలీసులకు ఆ పాప తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
For National News And Telugu News..