Share News

Viral: ఈ గ్రామంలో పెళ్లైన జంటలు వారం రోజులు డ్రెస్సులే వేసుకోరు.. కారణమిదేనట..

ABN , Publish Date - Sep 20 , 2024 | 06:43 PM

Viral News: పెళ్లి అనేది చాలా పెద్ద క్రతువు. అనేక రకాల ఆచారాలు, సంప్రదాయాలు, పూజా క్రతువులను ఆచరిస్తూ ఇద్దరు స్త్రీ, పురుషులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. పెళ్లైన దంపతులు సైతం తమ తమ కుటుంబాల్లో వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. తాజాగా ఇలాంటి వింత ఆచారం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

Viral: ఈ గ్రామంలో పెళ్లైన జంటలు వారం రోజులు డ్రెస్సులే వేసుకోరు.. కారణమిదేనట..
Couple

Pini Village Couple: భారతదేశం భిన్న మతాలు, విభిన్న కులాలు, తెగలు, జాతుల వారు నివసిస్తుంటారు. ఒక ప్రాంత ప్రజలకు, మరో ప్రాంత ప్రజలకు ఆచార వ్యవహారాల్లో, సంప్రదాయాల్లో చాలా తేడాలు ఉంటాయి. వివాహ క్రతువు విషయానికి వస్తే.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వివాహం జరుపుతారు. తరతరాలుగా వస్తున్న వారి వివాహ సంప్రదాయాలను పాటిస్తుంటారు. కొన్ని చోట్ల పెళ్లి తరువాత దుస్తులు చింపుకునే ఆచారం ఉంటే.. మరికొన్నిచోట్ల వధూవరులను ఒక గదిలో ఉంచే ఆచారం ఉంటుంది. ఇవాళ మనం పూర్తిగా భిన్నమైన, ఇప్పటి వరకు ఎప్పుడూ వినని సంప్రదాయం గురించి తెలుసుకుందాం..


హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలోని పిని గ్రామంలో వివాహానికి సంబంధించి విచిత్రమైన సంప్రదాయం ఉంది. అక్కడి ప్రజలు ఈ విచిత్రమైన సంప్రదాయాన్ని తరతరాలుగా ఆచరిస్తున్నారట. పెళ్లి అయిన మొదటి ఐదు రోజుల పాటు కొత్త వధువు ఎలాంటి దుస్తులు ధరించకూడదు. కేవలం ఉన్నితో చేసిన ఒక బెల్టును మాత్రమే ధరిస్తారట. వధువే కాదు.. వరుడు కూడా కొన్ని నియమాలు పాటించాలట. ఈ ఐదు రోజులు పురుషులు మద్యం సేవించకూడదు. ఈ ఆచారాలను వధువరులిద్దరూ పాలించడం ద్వారా వారి దాంపత్య జీవితం హాయిగా, సుఖ సంతోషాలతో సాగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. అందుకే.. అక్కడ పెళ్లైన ప్రతి జంట ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తుందట. ఇలాంటి విభిన్నమైన ఆచార సంప్రదాయాలు భారతదేశంలో చాలా ఉన్నాయి.


Also Read:

గొడుగులు అద్దెకిచ్చే కంపెనీ ఉందని మీకు తెలుసా..

గొడుగులు అద్దెకిచ్చే కంపెనీ ఉందని మీకు తెలుసా..

చొరబాటుదారులకు ఇక్కడ చోటు లేదు

For More Viral News and Telugu News..

Updated Date - Sep 20 , 2024 | 06:43 PM