Sinking Car Safety Tips: నీటిలో మునుగుతున్న కారు నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే..
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:55 PM
దేశంలో వర్షాకాలంలో ఎక్కువగా కార్లు నీట మునిగి ప్రమాదాలు జరిగిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతోపాటు ఆకస్మాత్తుగా కార్లు.. చెరువులు, కాలువల్లోకి దూసుకెళ్లి పలువురు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కార్ల నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ప్రతి ఏటా కూడా అనేక చోట్ల రోడ్లపై వరదలు రావడం, వాగులు, వంకలు తెగిన సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. దీంతోపాటు కొన్నిసార్లు కార్లు.. చెరువులు, కాలువలు, బావులలో పడిన సందర్బాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అలాంటి సందర్భాలలో ఆయా ప్రాంతాలలో కార్లలో ప్రయాణించిన వారు కారు(car)తోపాటు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల కారణంగా ప్రతి ఏటా దాదాపు 400 మంది మరణిస్తున్నారు. ఈ ఘటనలు ఎక్కువగా కోస్తా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.
దేశంలోని ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా డిసెంబర్ 7న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు యువకులు మృతిచెందారు. అయితే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మిమ్మల్ని మీరు మునిగిపోతున్న కారు (Sinking Car Safety Tips) నుంచి ఎలా రక్షించుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ధైర్యంగా ఎదుర్కోవాలి
కారు ప్రమాదాలు జరిగినప్పుడు కార్లతో పాటు పలువురు నీటిలో చిక్కుకుంటారు. ఆ సమయంలో అనేక మంది ఊపిరాడక మరణిస్తుంటారు. కానీ అలాంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా మిమ్మల్ని మీరు సులభంగా రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రక్షించుకోవాలి
మీరు మీ కారుతోపాటు నీటిలో మునిగిపోతే, మొదట మునిగిపోతున్నామనే ఆలోచనకు బదులు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనే ఆలోచనపై దృష్టి పెట్టాలి. భయాందోళన చెందకుండా నీటిలో పడిన వెంటనే ముందు సీటు బెల్ట్ తొలగించి వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించండి. సాధారణంగా మునిగిపోతున్న కారులో ఎవరైనా చిక్కుకున్నప్పుడు, కారుపై నీటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా కారు, తలుపు లేదా కిటికీ తెరవడం చాలా కష్టమవుతుంది.
విండో గుండా..
కాబట్టి కార్ డోర్లకు బదులుగా విండోలను తెరవడానికి ప్రయత్నించండి. మీరు కార్ డోర్ తెరిస్తే, వాహనంలోకి ఒక్కసారిగా నీరు ఎక్కువగా వస్తుంది. ఇది మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి మీరు విండోను తెరిచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించండి.
పిల్లలుంటే
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వీలైతే వాహనంలో కూర్చున్న వారందరూ ముందుగా కిటికీలోంచి బయటకు రావాలి. వాహనం పూర్తిగా మునిగిపోకపోతే ముందుగా పిల్లలుంటే వారిని వెంటనే బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత మిగతా వారు బయటకు రావచ్చు. ఒకవేళ కారు పూర్తిగా మునిగితే పిల్లలకు ధైర్యం చెప్పి, వారితోపాటు అందరూ కూడా విండో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాలి. నిమిషం నుంచి రెండు నిమిషాల సమయంలోపే అప్రమత్తంగా వ్యవహరించి బయటకు రావాలి. ఆలస్యం అయినకొద్ది ఇబ్బంది పెరుగుతుంది.
పనిచేయకపోతే
కొన్ని వాహనాలకు ఎలక్ట్రానిక్‌గా పనిచేసే విండోలు ఉంటాయి. వీటిలో నీరు చేరడం వల్ల షార్ట్ సర్క్యూట్ సమస్యలు ఏర్పడవచ్చు. ఆ కారణంగా విండోను తెరిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో విండోను పగులగొట్టాలి. అందుకోసం కిటికీని పగులగొట్టేందుకు పదునైన వస్తువులను ఉపయోగించండి.
కారు పైకి వెళ్లేందుకు
అయితే నీటిలో పడిన కారు క్రమంగా మునిగిపోతున్న సమయంలో వెంటనే మీరు అప్రమత్తమై, డోర్ కిటీకి నుంచి బయటకు వచ్చి కారు ముందుపై బాగానికి వెళ్లాలి. ఆ క్రమంలో కార్ డోనెట్ పైకి చేరి అక్కడి నుంచి క్రమంగా బయటకు వెళ్లాలి.
ఇవి కూడా చదవండి:
Shooting: పట్టపగలు దారుణం.. మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యాపారిపై కాల్పులు, హత్య
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More National News and Latest Telugu News