Share News

Viral Video: ఆకలితో ఉన్న మేకకు.. ఈ గేదె చేసిన సాయానికి.. దండం పెట్టాల్సిందే..

ABN , Publish Date - Aug 22 , 2024 | 06:15 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. అందులోనూ విచిత్రంగా ప్రవర్తించే జంతువుల వీడియోలు.. నెటిజన్లను వినోదాన్ని అందించడమే కాకుండా గుణపాఠం కూడా నేర్పిస్తుంటాయి. సమాజంలో...

Viral Video: ఆకలితో ఉన్న మేకకు.. ఈ గేదె చేసిన సాయానికి.. దండం పెట్టాల్సిందే..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. అందులోనూ విచిత్రంగా ప్రవర్తించే జంతువుల వీడియోలు.. నెటిజన్లను వినోదాన్ని అందించడమే కాకుండా గుణపాఠం కూడా నేర్పిస్తుంటాయి. సమాజంలో సేవాభావంతో మెలగాలనే సందేశాన్ని ఇస్తుంటాయి. ఇలాంటి జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఆకలితో ఉన్న మేకకు.. గేదె చేసిన సాయం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ మేక మేత కోసం చుట్టూ వెతుకుతుంది. అయినా దానికి ఎక్కడా మేత కనిపించదు. అన్నీ పెద్ద పెద్ద చెట్లే కావడంతో ఆకులు తినడం కష్టమవుతుంది. దీంతో చేసేందేమీ లేక ఓ చెట్టు వద్ద నిల్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ చెట్టుకు కట్టేసి ఉన్న గేదె మేకను గమనిస్తుంది. ‘‘దీనికి ఎందుకు అంత బాధపడతావ్.. నా మీద నిలబడి చెట్టుపై ఉన్న ఆకులు తినేసెయ్’’.. అన్నట్లుగా సిగ్నల్ ఇస్తుంది.

Viral Video: పెళ్లి వేదికపై వరుడి చేసిన మిస్టేక్‌తో అవాక్కైన వధువు.. చివరకు ఏమైందో చూడండి..


దీంతో విషయం అర్థం చేసుకున్న మేక.. ముందుగా గేదె తలపై కాళ్లు పెట్టి, ఆపై ఎంతో చాకచక్యంగా (goat standing on buffalo) గేదె మీదకు వెళ్లి నిలబడుంది. తర్వాత తన ముందు కాళ్లను చెట్టుపై ఉంచి.. పైన ఉన్న ఆకులను తినేస్తుంది. ఇలా మేక ఆకలి తీర్చేందుకు గెదె తన వంతుగా ఇలా సాయం చేస్తుంది. ఈ ఘటనను అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా తిలకించారు.

Viral Video: అప్పటిదాకా వధువు వెనుక నిలబడ్డ యువకుడు.. అంతలోనే వరుడి కళ్లుగప్పి..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గేదెను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘మేక ఆకలి తీర్చిన గేదె’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 22 , 2024 | 06:15 PM