Spit Stains: ఈ మహిళ కష్టం చూసాకైన జనాల్లో మార్పొస్తుందా? నెటిజన్లను కలచివేస్తున్న వీడియో!
ABN , Publish Date - Mar 28 , 2024 | 03:02 PM
సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఓ సమస్యను ఎత్తి చూపుతూ ఐఏఎస్ అధికారి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్లను అమితంగా కలిచివేస్తోంది.
ఇంటర్నె్ట్ డెస్క్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఓ సమస్యను ఎత్తి చూపుతూ ఐఏఎస్ అధికారి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral video) మారింది. నెటిజన్లను అమితంగా కలచివేస్తోంది. ఈ వీడియో చూసైనా ప్రజల్లో మార్పు రావాలని అనేక మంది కామెంట్ చేశారు. ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ ఈ వీడియోను షేర్ చేశారు.
రైల్వే స్టేషన్‌లో (Railway station) పనిచేస్తున్న ఓ పారిశుధ్య కార్మికురాలి (Sanitary worker) వీడియో ఇది. అక్కడ ఓ స్తంభంపై వదలని పాన్, గుట్కా ఉమ్మి మరకలను (Spit stains) తొలగించేందుకు ఆమె నానా యాతనా పడుతోంది. పబ్లిక్ ప్రాపర్టీలను శుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా వాటి ప్రయత్నాలు పూర్తి ప్రయోజనాన్ని ఇవ్వట్లేదు.
Juvenile Robbers: 11 ఏళ్ల వయసులోనే బ్యాంకు దోపిడీ.. సెలవుల్లో స్కూలు పిల్లల దారుణం! ఎలా చేశారంటే..
కాగా, ఎంత కష్టపడినా మరకలు పోకపోవడంతో వీడియోలోని మహిళ తన అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయద్దని ఎన్ని సార్లు చెబుతున్నా ప్రజల్లో మార్పు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వాటిల్ని శుభ్రం చేయలేక నానా యాతనా పడుతున్నానని చెప్పుకొచ్చింది.
Viral: నాగు పాముకు పెదవులపై కిస్ ఇచ్చిన యువతి.. ఆ తరువాత ఊహించని విధంగా..
ఇక వీడియో చూసిన అనేక మంది ఆ పారిశుధ్య కార్మికురాలికి ధన్యవాదాలు చెబుతూనే జనాల్లో ఇంకా మార్పు రానందుకు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు చూసైనా జనాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అనేక మంది ఆ మహిళకు ధన్యవాదాలు తెలిపారు. కొందరేమో గుట్కా, పొగాపై నిషేధం విధించాలని అన్నారు. అయితే, ఢిల్లీ హైకోర్టు గతంలోనే ఈ దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ క్యాపిటల్ ప్రాంతం పరిధిలో పొగాకు, పాన్ మసాలా, గుట్కా ఉత్పత్తుల నిల్వ, పంపిణీ, అమ్మకాలు చేపట్టకూడదని గతేడాది తీర్పు వెలువరించింది.
Viral: చదువుకున్నోళ్లలా ఉన్నారు..ఇలా చేసేందుకు మనసెలావచ్చిందో! షాకింగ్ వీడియో
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి