Share News

Charles Sobhraj: బాబోయ్.. వెయ్యి కార్లు దొంగిలించి.. 2 వేల మంది ఖైదీలను విడిపించి.. వీడి అరాచకం మాములుగా లేదుగా..?

ABN , Publish Date - Feb 26 , 2024 | 01:12 PM

పోలీసుల పాలిట సింహ స్వప్నం ఛార్లెస్ శోభరాజ్. ఈ వృద్దుడు చేయని నేరం లేదు. కార్లు దొంగతనం చేయడం , జడ్జీ అవతారం ఎత్తడం, స్టేషన్ మాస్టర్‌గా మారి ప్రభుత్వ నిధులను కాజేశాడు.

Charles Sobhraj: బాబోయ్.. వెయ్యి కార్లు దొంగిలించి.. 2 వేల మంది ఖైదీలను విడిపించి.. వీడి అరాచకం మాములుగా లేదుగా..?

ఏబీఎన్ నెట్‌వర్క్: ఒక్కటి కాదు రెండు ఏకంగా వెయ్యి కార్ల దొంగతనం, ఓ 2 వేల మంది ఖైదీలను విడిపించడం.. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. అతనే ఛార్లెస్ శోభరాజ్ (Charles Sobhraj) అలియాస్ ధాని రామ్ మిట్టల్. శోభరాజ్ మోసగాళ్లకు మోసగాడు. పేరు మోసిన హంతకుడు. 1970లలో ఆసియాలో పర్యటించిన టూరిస్టులను దోపిడి చేసి, దారుణంగా హతమార్చాడు. అతను చేసిన నేరాలు భారత దేశ (India) చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోతాయి.

లా చేసి..

ఛార్లెస్ శోభరాజ్ న్యాయవాద విద్య పూర్తి చేశాడు. చేతిరాత నిపుణుడు, గ్రాఫాలజిస్ట్. తెలివిని ఉపయోగించి, అతనికి ఉన్న నైపుణ్యంతో ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేసేవాడు. అధికారులను మచ్చిక చేసుకునేవాడు. నేరం చేసి, ఈజీగా చట్టం నుంచి తప్పించుకునే వాడు. శోభరాజ్ ప్రస్తుత వయస్సు 78 ఏళ్లు. ఇప్పటికీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. శోభరాజ్ వెయ్యికి పైగా కార్లను దొంగిలించాడు. అతనిపై పోలీసులు 130 కేసులు నమోదు చేశారు.

ఏకంగా జడ్జీగా మారి..

శోభరాజ్ చేసిన ఓ నేరం అతని తెలివి, నైపుణ్యాన్ని తెలియజేస్తోంది. 2000 ఏడాదిలో హర్యానా ఝాజ్జర్‌లో ఏకంగా న్యాయమూర్తిగా (జడ్జీ) మారిపోయాడు. ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. రెండు నెలలకు పైగా జడ్జీగా సౌకర్యాలను అనుభవించాడు. తన తోటి ఖైదీలు 2 వేల మందిని జైలు నుంచి విడిపించాడు. శోభరాజ్ గురించి అధికారులు తెలుసుకునేలోపు అక్కడి నుంచి పారిపోయాడు. శోభరాజ్ స్నేహితులు, సన్నిహితులు కూడా తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేసేవారు. ప్రభుత్వం నుంచి వసతులు పొందేవారు. కొన్ని సందర్భాల్లో నిధులను కాజేసేవారు.

స్టేషన్ మాస్టర్..

శోభరాజ్ 1968 నుంచి 1974 వరకు స్టేషన్ మాస్టర్ అవతారం ఎత్తాడు. ఆ సమయంలో ఫోర్జరీ పత్రాలను తయారు చేశాడు. రైల్వే ఆస్తులు, డబ్బులను కాజేశాడు. తాను దొంగిలించిన వాహనాలను తప్పుడు రిజిస్ట్రేషన్ పేపర్స్ తయారు చేసేవాడు. తప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ రూపొందించేవాడు. దొంగిలించిన కార్లను తనకు తెలిసిన స్క్రాప్ డీలర్లకు విక్రయించేవాడు. శోభరాజ్ దొంగిలించిన కార్లు అన్ని పాతవే కావడం గమనార్హం. వాటిలో యాంటీ థెప్ట్ సెక్యూరిటీ సిస్టమ్ లేకపోవడంతో కార్లను దొంగిలించినప్పటికీ పోలీసులకు చిక్కలేదు.

పగటిపూట దొంగతనాలు

పాత కార్లను మధ్యాహ్నం సమయంలో దొంగిలించేవాడు. డుప్లికేట్ కీ ఉపయోగించి లేదంటే తాళాన్ని తీసి కార్లను తీసుకెళ్లేవాడు. తర్వాత ఆ కార్ల నంబర్ ప్లేట్లను మార్చేవాడు. కార్ల కలర్ మార్చి, గుర్తుపట్టలేనట్టుగా మార్చేవాడు. 2016లో పశ్చిమ ఢిల్లీలో మారుతి ఎస్టిమ్ కారును స్క్రాప్ డీలర్‌కు అమ్మేందుకు వెళ్లే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. మార్చిలో అరెస్ట్ చేయగా, అదే ఏడాది మే నెలలో జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇలా శోభరాజ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు.

మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 01:22 PM