Viral Video: విద్యార్థులతో మసాజ్.. వీళ్లు టీచర్లేనా
ABN , Publish Date - Oct 12 , 2024 | 03:25 PM
బడి దేవాలయంగా.. పాఠాలు చెప్పే టీచర్లను దేవుళ్లలా కొలుస్తారు. అలాంటి టీచర్లు వక్ర బుద్ధిలో వెళ్తే పర్యవసనాలు ఎదుర్కోక తప్పదు. తాజాగా ఓ మహిళ టీచర్ విద్యార్థులతో సపర్యలు చేయించుకుంటున్న వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: బడి దేవాలయంగా.. పాఠాలు చెప్పే టీచర్లను దేవుళ్లలా కొలుస్తారు. అలాంటి టీచర్లు వక్ర బుద్ధిలో వెళ్తే పర్యవసనాలు ఎదుర్కోక తప్పదు. తాజాగా ఓ మహిళ టీచర్ విద్యార్థులతో సపర్యలు చేయించుకుంటున్న వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో ఈ ఘటన జరిగింది. వీడియోలో ఉన్న వివరాల ప్రకారం.. జైపుర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు నేలపై పడుకుని ఉండగా విద్యార్థులు ఆమె కాళ్లపై నిలబడి మసాజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆ విద్యార్థి తన స్నేహితుడి సపోర్ట్ తీసుకున్నాడు.
కుర్చీలో మరో ఉపాధ్యాయురాలు కూర్చుని ఉన్నా.. అలా చేయవద్దని కనీసం వారించకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఈ సంఘటనపై పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కర్తార్‌పూర్‌లోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
స్పందించిన ప్రిన్సిపల్..
పాఠశాల ప్రిన్సిపల్ అంజు చౌదరి ఈ ఘటనపై స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తమ టీచరేనని అంగీకరించారు. ఈ ఘటనపై తనకు సమచారం అందలేదన్నారు. టీచర్ అనారోగ్యంతో ఉండవచ్చని, అందుకే కాళ్లకు మసాజ్ చేయమని పిల్లలను అడిగి ఉండొచ్చని చెప్పారు. నిజానిజాలు తేలాలంటే దర్యాప్తు అవసరమని తెలిపారు. ఈ వివాదంపై పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. విద్యార్థులతో సపర్యలు చేయించుకున్న ఉపాధ్యాయురాలిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ టీచర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే.. ‘మూసీ దర్బార్’ పెట్టాలి
ఇదికూడా చదవండి: Gaddar: తూప్రాన్ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్ పేరు
ఇదికూడా చదవండి: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు
ఇదికూడా చదవండి: Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?
Read Latest Telangana News and National News