Poonch: లోయలో పడిన ఆర్మీ వాహనం, ఐదుగురు జవాన్లు మృతి
ABN , Publish Date - Dec 24 , 2024 | 08:45 PM
సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం ఘరోవా ప్రాంతంలో ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోతైన లోయలో పడి ఐదుగురు మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు.
పూంచ్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ (Poonch) జిల్లాలో మంగళవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం ఘరోవా ప్రాంతంలో ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోతైన లోయలో పడి ఐదుగురు మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సహాయక చర్యలు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయని, క్షతగాత్రులను సమీప ఆర్మీ ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఆర్మీ పోస్ట్‌కు తిరిగి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి లోయలో పడినట్టు చెప్పారు.
Jagdeep Dhankar: కూరగాయల కత్తిని బైపాస్ సర్జరీకి వాడకూడదు: జగ్‌దీఫ్ ధన్‌ఖడ్
ఇదే తరహా ప్రమాదం గత నవంబర్ 4న కూడా రాజౌరి జిల్లా బడాగ్ ప్రాంతంలో జరిగింది. ఆర్మీ వాహనం లోయలో పడిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరుగాయపడ్డారు.
కాగా, ఈ నెల ప్రారంభంలో పూంచ్ జిల్లాలో ఎల్ఓసీ వెంబడి గస్తీ తిరుగుతున్న ఆర్మీ జవాను ఒకరు మందుపాతర పేలడంతో మృతిచెందాడు. పొరపాటున మందుపాతరపై కాలువేయడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ పేలుడులో 25 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెదిన హవాల్దార్ వి.సుబ్బయ్య వరికుంట మృతి చెందినట్టు ధ్రువీకరించారు. సైనికుడి మృతికి సంతాపసూచకంగా వైట్ నైట్ కాప్ట్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) లెఫ్టినెంట్ జనరల్ నవీన్ సచ్‌దేవ, ఇతర ర్యాంకు అధికారులు నివాళులర్పించారు.
ఇది కూడా చదవండి..
NDA government : గత ఏడాదిన్నరలో..10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం
Chennai: దిండివనం వద్ద పట్టాలపై పగుళ్లు
Delhi Assembly Elctions: సీఎంపై పోటీకి దిగుతున్నదెవరంటే..
For National News And Telugu News