Share News

Kitchen Tips: ఇంట్లో పెరుగు లేకపోయినా సరే పెరుగు తయారు చెయ్యవచ్చా? ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి..!

ABN , Publish Date - Oct 04 , 2024 | 01:31 PM

పెరుగు చేయడానికి వేడి చేసిన పాలలో కొన్ని చుక్కల పెరుగు వేస్తారు. కానీ కొన్ని సార్లు ఇంట్లో పెరుగు ఉండదు. అలాంటి సమయంలో ఈ పద్దతి భలే సహాయపడుతుంది.

Kitchen Tips: ఇంట్లో పెరుగు లేకపోయినా సరే పెరుగు తయారు చెయ్యవచ్చా? ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి..!
curd making

పెరుగు భారతీయుల ఆహారంలో చాలా కీలకమైనది. అటు ప్రోటీన్ ను, ఇటు ప్రోబయోటిక్ ను కలిగి ఉన్న పెరుగులో విటమిన్లకు కూడా లోటు లేదు. భారతీయ సాంప్రదాయ ఆహారంలో చివరగా పెరుగు అన్నం తినకపోతే ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో రోజులో మిగిలిన పాలను పెరుగుగా చేసుకోవడం పరిపాటి. ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు నాణ్యతతో ఉంటుంది. అందుకే చాలా మంది ఇల్లాల్లు ఇంట్లోనే పెరుగు చేస్తారు. అయితే పెరుగు చేయడానికి వేడి చేసిన పాలలో కొన్ని చుక్కల పెరుగు వేస్తారు. కానీ కొన్ని సార్లు ఇంట్లో పెరుగు ఉండదు. అలాంటి సమయంలో పెరుగు ఎలా తయారు చేయాలి? సాధారణంగా ఇలా పాలను తోడు పెట్టడానికి కాసింత పెరుగు కోసం పక్కింటికో, ఎదురింటికో వెళుతుంటారు. ఆ అవసరం లేకుండా ఇంట్లో ఈజీగా సింపుల్ టిప్ తో పెరుగు తయారు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుంటే..

వెల్లుల్లి నీటిని ప్రతిరోజూ తాగుతుంటే శరీరంలో కలిగే మార్పులు ఇవే..


  • పెరుగును ఉపయోగించకుండా పాలను పెరుగుగా మార్చడానికి ఎప్పటిలాగే పాలను వేడి చేయాలి. వేడి చేసిన తరువాత పాలను చల్లార్చాలి. పాలు పూర్తీగా చల్లారకూడదు. గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

  • గోరువెచ్చగా ఉన్న పాలలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ లేదా నిమ్మరసం కలపాలి. వెనిగర్ లేదా నిమ్మరసం వేసిన తరువాత పాలను మెల్లిగా.. బాగా మిక్స్ చేయాలి.

  • పాలను కలిపిన తరువాత పాల గిన్నెను ఒక గుడ్డతో చుట్టాలి. లేదంటే మూత పెట్టాలి. ఈ పాలను రాత్రి సమయంలో 6-8 గంటల సేపు వెచ్చని ప్రాంతంలో ఉంచాలి. నిమ్మరసం లేదా వెనిగర్ లో ఉండే ఆమ్లస్వభావం పాలను పులియబెడుతుంది. తద్వారా పెరుగుగా మారుస్తుంది.

  • పాలను ఇలా తోడు పెట్టిన 6 నుండి 8 గంటల తరువాత పెరుగుగా మారిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా పెరుగుగా మారకపోతే ఇంకొద్దిసేపు దాన్ని అలాగే వదిలేయాలి. ఒకవేళ అప్పటికే పెరుగు తయారై ఉంటే దాన్ని ఫ్రిజ్ లో ఉంచాలి. ఫ్రిజ్ లో ఉంచడం వల్ల పెరుగు క్రీమ్ లాగ మృదువుగా మారుతుంది. సుమారు 2 గంటలసేపు ఫ్రిజ్ లో ఉంచిన తరువాత పెరుగును వాడుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

Food Tips: రోజూ ఆహారంలో సలాడ్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఆహార నిపుణులు ఏం చెప్పారంటే..!

Health Tips: నీళ్లలో పటిక కలుపుకుని స్నానం చేయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 04 , 2024 | 05:46 PM