Viral Video: చనిపోయిన సహజీవిని పట్టుకుని ఏడుస్తున్న ‘కోలా’.. గుండెను పిండేస్తున్న వీడియో..
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:00 PM
Koala Hugs Lifeless Body: బంధాలు.. బంధుత్వాలు.. బాధలు, సంతోషాలు మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటాయి. అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైంది. తాజాగా తన సహచర జీవిని కోల్పోయిన ‘కోలా’(Koala) విగత జీవిని పట్టుకుని రోధించింది. చనిపోయిన ఆడ కోలాను పట్టుకుని.. మగ కోలా విలపించింది. తన రెండు చేతులతో చనిపోయిన కోలాను పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఏడ్చేసింది.
Koala Hugs Lifeless Body: బంధాలు.. బంధుత్వాలు.. బాధలు, సంతోషాలు మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటాయి. అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైంది. తాజాగా తన సహచర జీవిని కోల్పోయిన ‘కోలా’(Koala) విగత జీవిని పట్టుకుని రోధించింది. చనిపోయిన ఆడ కోలాను పట్టుకుని.. మగ కోలా విలపించింది. తన రెండు చేతులతో చనిపోయిన కోలాను పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఏడ్చేసింది. ఎంతకూ లేవని తన సహచర జీవిని హత్తుకుని.. తన బాధను వ్యక్తం చేసింది కోలా. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది.
ఈ వీడియోను సౌత్ ఆస్ట్రేలియన్ జంతు రక్షణ స్వచ్ఛంద సంస్థ ‘కోలా రెస్క్యూ’(Koala Rescue) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. ఓ చెట్టు కింద చనిపోయిన ‘కోలా’ను పట్టుకుని మరో కోలా ఏడవటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే కోలా రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. వారు వచ్చేంత వరకు స్థానికులు వాటిని ప్రొటెక్ట్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. చనిపోయింది ఆడ కోలా అని.. దాని పక్కనే కూర్చుని బాధపడుతన్న కోలా మగదని చెప్పారు.
చనిపోయిన ఆడ కోలాను పట్టుకుని మగ కోలా ఏడవడం మనసును కకావికలం చేస్తుంది. కోలా సామాజిక సంబంధాల లోతును తెలియజేస్తుంది. కాగా, రెస్క్యూ టీమ్ ఈ రెండు కోలాలను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. మగ కోలాకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. తిరిగి అడవిలోకి వదిలేశారు. ఆడ కోలా మరణానికి కారణం తెలియలేదు. అనారోగ్యం, గాయం లక్షణాలేవీ కనిపించలేదని రెస్క్యూ టీమ్ తెలిపింది. మొత్తంగా ఈ వీడియోను నెటిజన్ల హృదయాలను పిండేస్తుంది. మరెందుకు ఆలస్యం.. వీడియోను మీరూ చూసేయండి.