Share News

Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో ఎన్నో అనుమానాలు.. పోలీసుల టైమ్‌ లైన్‌లో తేడాలు ఎందుకు..!?

ABN , Publish Date - Aug 23 , 2024 | 04:39 PM

వైద్యురాలి మృతి కేసులో తొలి నుంచి కోల్ కతా పోలీసుల తీరు సందేహాదాస్పదంగా ఉంది. వైద్యురాలి కేసులో పోలీసుల వెర్షన్ ఒకలా ఉంటే, సీబీఐ అధికారులు, ఆ వైద్యురాలి పేరంట్స్ వెర్షన్ మరోలా ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 14 గంటల సమయం పట్టడంతో సందేహాలు వస్తోన్నాయి.

Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో ఎన్నో అనుమానాలు.. పోలీసుల టైమ్‌ లైన్‌లో తేడాలు ఎందుకు..!?
Kolkata Police Timeline Changes

కోల్ కతా: వైద్యురాలి మృతి కేసులో తొలి నుంచీ కోల్‌కతా పోలీసుల (Kolkata Police) తీరు సందేహాదాస్పదంగా ఉంది. వైద్యురాలి కేసులో పోలీసుల వెర్షన్ ఒకలా ఉంటే, సీబీఐ అధికారులు, ఆ వైద్యురాలి పేరంట్స్ వెర్షన్ మరోలా ఉంది. వైద్యురాలి కేసులో ఇంతకీ ఏం జరిగింది..? పోలీసులు చెబుతోన్న టైమ్ లైన్‌లో ఉన్న తేడాలు ఎందుకున్నాయి. దీనిపై మృతురాలి పేరంట్స్ ఏమంటున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 14 గంటల సమయం ఎందుకు పట్టింది..?


kolkata.jpg


ఆగస్ట్ 9, 9.30: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఉదయం 9.30 గంటలకు పీజీ ఫస్ట్ ఇయర్ ట్రైనీ విద్యార్థి కొంత దూరం నుంచి వైద్యురాలిని అచేతనంగా చూశాడు. తర్వాత సహచరులు, సీనియర్ వైద్యులకు సమాచారం అందజేశాడు. వారు ఆస్పత్రి వర్గాలకు తెలియజేసి అప్రమత్తం చేశారు.

ఉదయం 10.10: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి పోలీస్ ఔట్ పోస్ట్ సిబ్బంది వైద్యురాలి గురించి తలా పోలీసులకు సమాచారం అందజేశారు. కాలేజీ మూడో అంతస్తులో గల సెమినార్ హాల్‌లో బల్ల మీద మహిళ అపస్మారక స్థితిలో పడి ఉందని వివరించారు. ఆ సమయంలో వైద్యురాలు అర్ధనగ్నంగా ఉందని, మెడికల్ కాలేజీ సిబ్బంది జనరల్ డైరీలో రాశారు. పోలీస్ ఔట్ పోస్ట్ సిబ్బంది సమాచారంతో పోలీసులు కాలేజీకి బయల్దేరారు.

ఉదయం 10.30: ఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఆ విషయాన్ని పై అధికారులకు నివేదించారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.


kolkata.jpg


ఉదయం 10.52: ఆర్జీ కర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వెంటనే ఆస్పత్రికి రావాలని కోరారు.

ఉదయం 11.00: కాలేజీ వద్దకు హోమిసైడ్ బృందం చేరుకుంది.

మధ్యాహ్నం 12.25: డిటెక్టివ్ విభాగంలోని సైంటిపిక్ విభాగానికి చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.29 గంటలకు మృతదేహం ఫస్ట్ పిక్ తీశారు. ఫింగర్ ఫ్రింట్, ఫుట్ ఫ్రింట్ నిపుణులు సంఘటన స్థలానికి వచ్చారు. కోల్ కతా పోలీసు సీనియర్ అధికారులు కూడా వచ్చారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది.

మధ్యాహ్నం 12.44: వైద్యురాలిని పరీక్షించి, చనిపోయిందని డ్యూటీ డాక్టర్ నిర్ధారించారు.

మధ్యాహ్నం 1.00: వైద్యురాలి తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చారు. 10 నిమిషాలు వెయిట్ చేయించారు. తర్వాత సెమినార్ గది వద్దకు తీసుకెళ్లారు.


kolkata-high-court.jpg


మధ్యాహ్నం 1.47: వైద్యురాలి మృతికి సంబంధించి డెత్ సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్‌ను పోలీసులకు వైద్యులు అందజేశారు. శరీరంపై గాయాలు అయ్యాయని, సున్నితమైన ప్రాంతంలో గాయాలు ఉన్నాయని.. అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.

మధ్యాహ్నం 3.00: వైద్యురాలి మృతిపై తల్లిదండ్రులకు సందేహాం కలిగింది. జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్ సమక్షంలో పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం చేసే సమయంలో వీడియో తీయాలని షరతు విధించారు.

సాయంత్రం 4.10: తల్లిదండ్రులు, కోలిగ్స్ ఆందోళనతో జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్ కాలేజీ వద్దకు వచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుంచి 4.40 గంటల వారితో చర్చలు జరిగాయి.

సాయంత్రం 6.10 నుంచి రాత్రి 7.10 వరకు: జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ ప్రక్రియను వీడియో తీశారు. గది బయట మృతురాలి తల్లిదండ్రులు, సహోద్యోగులు ఉన్నారు.


kolkata.jpg


రాత్రి 8.00: ఘటనా స్థలానికి డాగ్ స్వ్కాడ్ బృందం చేరుకుంది. 8.37 గంటల నుంచి 8.52 గంటల వరకు ఆ ప్రాంతంలో 3డీ మ్యాపింగ్ కూడా నిర్వహించారు.

రాత్రి 8.30 నుంచి 10.45 వరకు: ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాలను వీడియో తీశారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తవడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ సమయంలో కొందరు సాక్ష్యులు కూడా ఉన్నారు.

రాత్రి 11.45: వైద్యురాలిపై లైంగిక దాడి చేసి, హత్య చేశారని పోలీసులకు ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.


mamata-2.jpg


సందేహాలు ఇవే..

- పోలీసులు చెప్పిన సమయం ప్రకారం.. వైద్యురాలిని ఓ విద్యార్థి ఉదయం 9.30 గంటలకు చూశారు. ఆమె చనిపోయిందని మధ్యాహ్నం 12.44 గంటలకు నిర్ధారించారు. పరిస్థితి తెలియజేసేందుకు మూడు గంటల సమయం పట్టిందా..? ఆ మహిళ చనిపోయిందో లేదో తెలుసుకునేందుకు వైద్యుడు అవసరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.


ఆత్మహత్య కోణం:

-కూతురు బాగోలేదని ఉదయం 10.53 గంటలకు ఆస్పత్రి నుంచి తమకు ఫోన్ వచ్చిందని వైద్యురాలి పేరంట్స్ కోల్ కతా హైకోర్టుకు తెలిపారు.

-11.15 గంటలకు మరోసారి ఫోన్ వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారని పేర్కొన్నారు. కోల్ కతా పోలీసుల టైమ్ లైన్‌లో ఒకసారి ఫోన్ చేసినట్టు మాత్రమే చెప్పారు. వైద్యురాలు ఆత్మహత్య చేసుకుందని చెప్పలేదు.

-వైద్యురాలి తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చిన 10 నిమిషాల్లో సెమినార్ హాల్‌కు తీసుకెళ్లామని పోలీసుల టైమ్‌లైన్‌లో ఉంది. ఆస్పత్రి వద్ద మూడు గంటల పాటు పేరంట్స్ వెయిట్ చేశారట. తన కూతురు వద్దకు తీసుకెళ్లామని తల్లి బతిమిలాడితే తప్ప తీసుకెళ్లలేదట. ఈ విషయాన్ని పోలీసులు టైమ్ లైన్‌లో కావాలనే ప్రస్తావించలేదు.


- వైద్యురాలి మృతికి సంబంధించి పేరంట్స్ పలు సందేహాలు లేవనెత్తారు. పోలీసుల తీరుపై సందేహా పడ్డారు. వైద్యురాలి మృతిపై విద్యార్థుల ఆందోళనతో కోల్ కతా హైకోర్టు జోక్యం చేసుకుంది. కేసును సీబీఐ అధికారులకు అప్పగించారు. కేసు విచారణ కొనసాగుతోంది.


Read Latest
National News And Telugu News

Updated Date - Aug 23 , 2024 | 05:19 PM