Viral News: ప్రాణం తీసిన పాన్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Dec 01 , 2024 | 08:07 AM
పాన్ లేదా గుట్కా తినే వ్యక్తులు వారి ప్రయాణంలో గమనించకుండా ఉమ్మివేయడం చూస్తుంటాం. అలాంటి క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. అయితే ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు కూడా కదులుతున్న బస్ లేదా ట్రైన్ నుంచి వినూత్నంగా ప్రయాణిస్తున్నారా జాగ్రత్త. అయితే మీరు ప్రయాణం చేసే విషయంలో బయటకు తొంగి చూడటం, చేతులు, కాళ్లు బయట కనిపించేలా నిలబడటం చేయకండి. ఎందుకంటే ఈ విధంగా ప్రయాణం చేసి తాజాగా ఓ వ్యక్తి మరణించాడు. అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రోడ్‌వేస్‌కు చెందిన AC బస్సు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే గుండా వెళుతోంది.
అదే సమయంలో బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు బస్సు నుంచి కిందపడి మృతి చెందాడు. ప్రయాణికుడు ఉమ్మివేయడానికి బస్సు తలుపు తెరవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ క్రమంలో అతను బ్యాలెన్స్ కోల్పోయి, బస్సు నుంచి రోడ్డుపై పడిపోయాడు.
ఆయన భార్య కూడా..
పోలీసుల కథనం ప్రకారం లక్నో చార్‌బాగ్ డిపోకు చెందిన ఎయిర్ కండిషన్డ్ పింక్ బస్సు శనివారం ఉదయం అజంగఢ్ నుంచి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా లక్నోకు వెళ్తోన్న క్రమంలో ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణించి మరణించిన వ్యక్తిని 45 ఏళ్ల రామ్ జియావాన్‌గా గుర్తించారు. అంతేకాదు ప్రయాణ సమయంలో అతనితో పాటు ఆయన భార్య సావిత్రి కూడా ఉన్నారు. అతను లక్నోలోని చిన్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛత్రిక్ రోడ్ నివాసి. బస్సు సుల్తాన్‌పూర్ జిల్లాలోని బల్దిరాయ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, రామ్ జియావాన్ బస్ తలుపు తెరిచి ఉమ్మివేయడం ప్రారంభించాడు.
ప్రమాదం నేపథ్యంలో
అదే సమయంలో అతను బ్యాలెన్స్ తప్పి అకస్మాత్తుగా బస్సు నుంచి రోడ్డుపై పడి, వెంటనే మరణించాడు. ఆ క్రమంలో బస్సును వెంటనే నిలిపివేశారు. దీంతో ఉత్తర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది బాధితుడిని అంబులెన్స్ ద్వారా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారని బల్దిరాయ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ధీరజ్ కుమార్ తెలిపారు. అయితే ఆస్పత్రిలో వైద్యులు రామ్‌జీవాన్ మృతి చెందినట్లు ప్రకటించారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రాణం తీసిన పాన్
ఆ ప్రయాణికుడు తమలపాకు పాన్ తింటూ ఉమ్మివేయడానికి ప్రయత్నించిన క్రమంలో బిహి గ్రామ సమీపంలో కదులుతున్న బస్సు తలుపును అకస్మాత్తుగా తెరిచాడని, దీంతో అదుపుతప్పి కింద పడ్డాడని బస్సులో ప్రయాణికులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ తమలపాకులు తినే అలవాటు అనేక మందికి ఉంటుంది. ఈ ప్రమాదం నేపథ్యంలో అలాంటి వారు అప్రమత్తం అవుతారో లేదో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..