Viral video: కూర ఉడుకుతుండగా ఖాళీ అయిన సిలిండర్.. చిన్న ట్రిక్‌తో వంట ఎలా పూర్తిచేశాడంటే..
ABN , Publish Date - Jun 09 , 2024 | 05:11 PM
సినిమాలు, సీరియల్స్ చూసే సమయంలో ఉన్నట్టుండి కరెంట్ పోవడం, తీరా వంట పూర్తయ్యే సమయంలో గ్యాస్ అయిపోవడం వంటి ఘటనలు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి...
సినిమాలు, సీరియల్స్ చూసే సమయంలో ఉన్నట్టుండి కరెంట్ పోవడం, తీరా వంట పూర్తయ్యే సమయంలో గ్యాస్ అయిపోవడం వంటి ఘటనలు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీవీ చూస్తున్న వారు కరెంట్ వచ్చే దాకా ఎదురుచూడడం, గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తున్న వారు కట్టెల పొయ్యిపై చేయడమో, లేక పక్కింటి నుంచి సిలిండర్ తెచ్చుకోవడమే చేస్తారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. కూర ఉడుకుతుండగా గ్యాస్ అయిపోవడంతో చివరకు వంటను ఎలా పూర్తి చేశాడో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గ్యాస్ స్టవ్‌పై కూర (Cooking curry) వండుతున్నాడు. అయితే తీరా కూర వండడం పూర్తి కావచ్చే సమయంలో ఉన్నట్టుండి గ్యాస్ సిలిండర్ (Gas cylinder) ఖాళీ అయింది. అయినా అతను ఎలాగైనా కూర వండడం పూర్తి చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించే సమయంలో అతడికి ఓ వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా.. బాత్రూంలో ఉన్న (Water heater) వాటర్ హీటర్‌ను తీసుకొచ్చాడు.
Viral video: రాళ్లను పగులగొడుతుండగా కలిసొచ్చిన అదృష్టం.. అడుగున అనుమానాస్పదంగా ఉండడంతో..
వాటర్ హీటర్‌ను కూరలో ముంచి కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు. దీంతో హీటర్ కడ్డీలు వేడిగా మారడం వల్ల కూర ఉడకడం స్టార్ అయింది. ఇలా చాలా సేపు అలాగే ఉంచడంతో కూర మొత్తం ఉడికిపోయింది. ఇలా సింపుల్ ట్రిక్‌తో కూరను వండేశాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘వాటర్ హీటర్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral video: పులి నుంచి తప్పించుకోవడానికి కొండముచ్చుల పక్కా స్కెచ్.. సడన్‌గా ఎటాక్ చేయడంతో చివరకు..