Viral: రైలు ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం.. రిజర్వేషన్ ఉంది కదా అని ఏసీ కోచ్ ఎక్కితే..
ABN , Publish Date - May 25 , 2024 | 07:02 PM
ఏసీ కోచ్ లో రిజర్వేషన్ చేయించుకున్న ఓ రైలు ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. బోగీ మొత్తం జనరల్ ప్యాసెంజర్లతో నిండిపోయిందని వాపోయాడు. తాను ఎనిమిది మందికి టిక్కెట్టు ఉంటే కేవలం ఆరుగురికే సీటు దొరికిందని సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో రైళ్లల్లో రద్దీకి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రిజర్వేషన్ ఉన్న వారు ప్రయాణించే స్లీపర్, ఏసీ కోచ్‌లల్లో కూడా కాలుపెట్టే చోటు కూడా లేనంతటి రద్దీ చూసి జనాలు భయపడిపోతున్నారు. తాజాగా ఇలాంటి మరో షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా (Viral) మారింది. జనాలతో గగ్గోలు పెట్టిస్తోంది.
బ్రహ్మపుత్ర ఎక్స్ ప్రెస్ లో ఎనిమిది మంది సభ్యులున్న తన కుటుంబం కోసం ఓ వ్యక్తి ఏసీ-3 టైర్ కోచ్‌లో టిక్కెట్లు కొన్నాడు. తీరా రైలు ఎక్కుదామనేసరికి అతడికి ఊహించేని షాక్ తగిలింది. చివరకు తన కష్టాలను వివరిస్తూ అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Viral: ఫ్రెండేకదా అని పిల్లితో పరాచకాలు.. చిలకకు ఎలాంటి షాక్ తగిలిందంటే..
‘‘రైలు ఎక్కేందుకు నేనూ నా కుటుంబం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. మావి ఏసీ-3 టైర్ కన్‌ఫర్మడ్ టిక్కెట్లు. కానీ ఆ బోగీ మొత్తం జనరల్ ప్యాసెంజర్లతో కిటకిటలాడింది. నిబంధనలు పాటించే వాళ్లే లేకుండా పోయారు’’ అని విజయ్ అనే ప్రయాణికుడు నెట్టింట తన ఆవేదన పంచుకున్నాడు. ఎనిమిది మంది కుటుంబసభ్యుల కోసం తాను టిక్కెట్టు కొంటే కేవలం ఆరుగురికే సీటు దొరికిందని వాపోయాడు. బోగీ అంతా జనరల్ ప్యాసెంజర్లతో నిండిపోయిందని వాపోయాడు. టిక్కెట్టు లేని ప్రయాణికులు కూడా ఏసీ కోచ్ ను ఆక్రమించుకున్నారని చేప్పాడు (Man posts video of ticketless passengers overcrowding AC 3 coach Had to fight to board).
విపరీతమైన రద్దీ కారణంగా తాము కనీసం బాత్రూమ్ కు వెళ్లేందుకు కూడా మార్గం లేకపోయిందని విజయ్ చెప్పాడు. సీట్ల మధ్య దారంతా ప్రయాణికులు నిలబడి ఉన్నారని చెప్పారు. మహిళలు బాగా ఇబ్బంది పడ్డారని చెప్పారు. కనీస సేవలు కూడా పొందలేనప్పుడు రిజర్వేషన్ టిక్కెట్లు ఉండి ఏమిటి ప్రయోజనమని ప్రశ్నించాడు.
ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అతడి పరిస్థితికి అనేక మంది విచారం వ్యక్తం చేశారు. తామూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నామని వాపోయారు. అయితే, ఇటీవల రైళ్లల్లో ప్రయాణికుల రద్దీకి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.