Shocking: పాముతో బీర్ కాన్‌లో విషం కక్కించి తాగిన యువకుడు.. వైరల్ వీడియో
ABN , Publish Date - Mar 14 , 2024 | 08:45 PM
పాముతో బీర్ కాన్‌లో విషం కక్కించి తాగిన యువకుడు. నెట్టింట వీడియో వైరల్. జనాలకు షాక్!
ఇంటర్నెట్ డెస్క్: జంతువులను హింసించడం దారుణమని తెలిసీ కొందరు సరదా కోసం లేదా సాహసం పేరిట జంతువులతో క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. దురదృష్టవశాత్తూ ఈ వీడియోలు నెట్టింట కూడా వైరల్(Viral Video) అవుతుంటాయి. అలాంటి ఓ ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమవుతోంది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ జనాలు మాత్రం వీడియోలో యువకుడు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలోని యువకుడు ఓ రహదారి పక్కన పొదల్లోని ఓ పామును పట్టుకుంటాడు. అది చాలా చిన్న పాము. దాని తలను ఎటూ కదలకుండా రెండు వెళ్లతో గట్టిగా పట్టుకోవడంతో అది నొప్పితో గిలగిల్లాడింది. ఆ తరువాత దాన్ని బీర్ కాన్ మూత వద్దకు తీసుకురావడంతో అది అందులోకి విషం చిమ్మింది (Man Drinks beer with Snake Poison).
Viral: సుద్దపూసలా గుడిలోకి వచ్చి.. శివలింగానికి భక్తిశ్రద్ధలతో మొక్కి.. ఆపై ఊహించని విధంగా..
ఇంత జరిగాక కూడా ఆ యువకుడు తన తీరు మార్చుకోకపోగా మరింత షాకింగ్ పనికి ఒడిగట్టాడు. విషాన్ని బీర్‌లో బాగా కలిసేలా చేసి తాగేశాడు. వీడియో అక్కడితో ముగిసిపోవడంతో ఆ తరువాత ఏం జరిగిందీ తెలియరాలేదు. అయితే, పాము విషం తాగితే ఏం కాదని నెటిజన్లు కందరు బదులిచ్చారు. ఈ విషం నేరుగా రక్తంలో కలిస్తేనే ప్రాణాంతకమని చెబుతున్నారు. పాము విషం ఒక ప్రొటీన్ అని, దాన్ని తాగితే ఇతర ప్రొటీన్ల లాగానే కడుపులో అరిగిపోతుందని చెప్పుకొచ్చారు. ఇక జంతుప్రేమికులు మాత్రం ఈ వీడియోపై మండిపడ్డారు. ఇది పైశాచికత్వానికి పరాకాష్ఠ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జంతువులను హింసించే వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Viral: ఇంటర్వ్యూకు వచ్చిన యువతి కోరిక విని నోరెళ్లబెట్టిన కంపెనీ సీఈఓ!
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి