Viral News: టీ పెట్టిన చిచ్చు.. పెళ్లిలో కొట్టేసుకున్న బంధువులు.. చివర్లో పెద్ద ట్విస్ట్
ABN , Publish Date - Apr 23 , 2024 | 04:46 PM
తమకు సరైన మర్యాద ఇవ్వలేదనో, భోజనం సమయంలో మాంసం వడ్డించలేదనో.. పెళ్లిళ్లలో ఘర్షణలు చోటు చేసుకుంటుంటాయి. ముఖ్యంగా.. అబ్బాయి తరఫు వారి నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. ఫలితంగా.. అవి పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. సరదాగా జోకులేసినా..
తమకు సరైన మర్యాద ఇవ్వలేదనో, భోజనం సమయంలో మాంసం వడ్డించలేదనో.. పెళ్లిళ్లలో (Marriages) ఘర్షణలు చోటు చేసుకుంటుంటాయి. ముఖ్యంగా.. అబ్బాయి తరఫు వారి నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. ఫలితంగా.. అవి పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. సరదాగా జోకులేసినా.. చిన్నబుచ్చుకొని వెనుదిరుగుతుంటారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఇలాంటి సంఘటనే వెలుగు చూసింది. తమకు టీ పోయలేదనే కారణంతో అబ్బాయి తరఫు వారు వాగ్వాదానికి దిగడంతో.. అది చినికి చినికి పెద్ద గొడవగా మారింది. బీర్ బాటిళ్లు, కర్రలతో కొట్టేసుకున్నారంటే.. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో మీరే అర్థం చేసుకోండి. అయితే.. చివర్లో మాత్రం ఓ ఊహించని ట్విస్ట్ తెరమీదకి వచ్చింది. దాంతో.. అందరూ నోరెళ్లబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
‘భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వద్దు.. ఆ క్రికెటరే ముద్దు’
ఖమ్మంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన ఒక యువతికి చెరువుబజార్‌కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. దీంతో.. పెళ్లి కూతురి ఇంటి వద్ద పూజలకు పెళ్లి కొడుకు తరఫు బంధువులు వెళ్లారు. సాధారణంగా.. ఇంటికొచ్చిన అతిథులకు టీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది కాబట్టి, తమకూ టీ పోస్తారని అబ్బాయి తరఫు బంధువులు అనుకున్నారు. కానీ.. ఆ విషయంలో వాళ్లకు నిరాశ మిగిలింది. అమ్మాయి తరఫు సభ్యులు వాళ్లకు టీ పోయలేదు. ఈ విషయాన్ని వాళ్లు మనసులోనే పెట్టుకున్నారు. కట్ చేస్తే.. భోజనాలు ముగిసిన తర్వాత అందరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఆపై ఊరేగింపులో డాన్స్‌లు చేశారు. సరిగ్గా అదే టైంలో.. తమకు టీ పోయలేదని, మీకు మర్యాద చేయడం రాదంటూ వరుడి తరఫు బంధువులు ఘర్షణకు దిగారు. అందుకు.. భోజనం పెట్టడంతో పాటు మందు కూడా పోశాం కదా అని వధువు తరఫు బంధువులు సమాధానం ఇచ్చారు.
ధోనీ నెక్ట్స్ సీజన్‌లో ఉంటాడా.. ఆ వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?
ఇలా ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి.. అది ఘర్షణకు దారి తీసింది. గల్లాలు పట్టుకొని దాడులు జరుపుకున్నారు. అనంతరం బీరు సీసాలు, కర్రలతో కొట్టుకున్నారు. బీరు సీసాలతో దాడి చేయడంతో.. ఇద్దరి తలలు పగిలి, నాలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అధికారులు చేరుకొని.. ఇరువర్గాల్ని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే.. వారిపై కూడా కర్రలతో దాడి చేసేందుకు బంధువులు వెళ్లారు. దీంతో మరో దారి లేక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంత పెద్ద ఘర్షణ జరగడంతో.. ఇక పెళ్లి రద్దైనట్టేనని అంతా భావించారు. కానీ.. చివరికి ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పడంతో, వ్యవహారం సద్దుమణిగింది. దీంతో.. పెళ్లి వేడుక ప్రశాంతంగా ముగిసింది.
Read Latest Prathyekam News and Telugu News