Viral Video: ఇవి కదా తెలివితేటలు అంటే.. పైనాపిల్స్ సేల్స్ పెంచేందుకు ఇతడు వాడిన టెక్నిక్ తెలిస్తే..
ABN , Publish Date - Apr 10 , 2024 | 05:21 PM
వృత్తే దైవంగా భావించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇలాంటి వారు తాము చేసే ప్రతి పనిలో ఏకాగ్రత, వృత్తి పట్ల అంకితభావం కనిపిస్తుంటుంది. ఇంకొందరు తమ వ్యాపారంలో లాభాలు ఆర్జించేందుకు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి...
వృత్తే దైవంగా భావించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇలాంటి వారు తాము చేసే ప్రతి పనిలో ఏకాగ్రత, వృత్తి పట్ల అంకితభావం కనిపిస్తుంటుంది. ఇంకొందరు తమ వ్యాపారంలో లాభాలు ఆర్జించేందుకు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి వ్యాపారులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పైనాపిల్స్ సేల్స్ పెంచేందుకు ఓ వ్యాపారి వాడిన టెక్నిక్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడు ఎంతో ప్యాషన్‌గా ఆలోచిస్తూ సేల్స్ పెంచేశాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పైనాపిల్స్ విక్రయిస్తున్న ఓ యువకుడు.. టేబుల్‌పై కాళ్ల పెట్టి కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. అవాక్కవడానికి ఇందులో అంత విశేషం ఏముందీ అనేగా మీ సందేహం.. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే అతడి తెలివితేటలు మీకే అర్థమవుతాయి. పైనాపిల్స్ వ్యాపారంపై తన మక్కువను తెలియజేయడమే కాకుండా సేల్స్ (Pineapple Sales) పెంచేందుకూ ఆ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. తన జుట్టును మొత్తం (Hair style like pineapple) పైనాపిల్ తరహాలో డిజైన్ చేశాడు.
Optical illusion: ఈ రెండు చిత్రాల్లో దాగున్న 3 తేడాలను గుర్తిస్తే.. మీలో ఏకాగ్రత మెండుగా ఉన్నట్లే..
ఫైనల్‌గా చూస్తే అతడి తల మొత్తం అచ్చం పైనాపిల్ తరహాలోనే ఉంటుంది. వీడియోలో చూసేవాళ్లకి.. అతడి తల పైనాపిల్స్‌లో కలిసిపోయినట్లుగా ఉంది. ఆ దారిన వచ్చీపోయే వారంతా అతడి హెయిర్ స్టైల్ చూసి అవాక్కవుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది అతడి వద్ద పైనాపిల్స్ కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వ్యాపారి తెలివితేటలు అమోఘం’’.. అంటూ కొందరు, ‘‘వృత్తి పట్ల ఇతడి ప్యాషన్ చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.