Viral Video: టైర్లు కొత్తగా కనిపిస్తున్నాయని కొనేస్తున్నారా.. వీళ్ల తెలివితేటలు చూస్తే మతిపోవాల్సిందే..
ABN , Publish Date - Mar 24 , 2024 | 07:47 PM
ప్రస్తుత సమాజంలో కంటికి కనపడే ప్రతి వస్తువునూ కల్తీ చేసే పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఉప్పు నుంచి పప్పు వరకు కల్తీ జరుగుతుంటే.. మరోవైపు దుస్తుల నుంచి వాహనాల వరకూ అన్నింటిలోనూ నకిలీలు ఎక్కువైపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఇట్టే మోసపోవాల్సిన పరిస్థితి. కొందరైతే..
ప్రస్తుత సమాజంలో కంటికి కనపడే ప్రతి వస్తువునూ కల్తీ చేసే పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఉప్పు నుంచి పప్పు వరకు కల్తీ జరుగుతుంటే.. మరోవైపు దుస్తుల నుంచి వాహనాల వరకూ అన్నింటిలోనూ నకిలీలు ఎక్కువైపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఇట్టే మోసపోవాల్సిన పరిస్థితి. కొందరైతే అతి తెలివితో ఎలాంటి వారినైనా బురిడీ కొట్టిస్తుంటారు. ఇంకొందరు మసి పూసి మారేడుకాయను చేసిన చందంగా.. అసలు, నకిలీకి పోల్చుకోలేని విధంగా మోసాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాత టైర్లను కొందరు గీతలు గీసి కొత్తగా మార్చడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాత టైర్ల గోడౌన్‌లో (Old tires godown) కొందరు కార్మికులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా.. వాళ్లు చేస్తున్న పనిని కాస్త తీక్షణంగా పరిశీలిస్తే దిమ్మతిరుగుతుంది. వరుసగా పేర్చిన పాత టైర్లను ఒక్కొక్కటిగా తీసుకుని, కేవలం ఓ ఇనుప కడ్డీ ఉపయోగించి కొత్తగా మార్చేస్తున్నారు.
Viral Video: ఏనుగుల మధ్య భీకర యుద్ధం.. అంతా చూస్తుండగానే.. చివరకు..
టైరు మధ్యలో ఇనుప కడ్డీతో కొత్త టైరు తరహాలో నిలువు, అడ్డ గీతలు గీశారు. తర్వాత టైరును బాగా శుభ్రం చేసి, తళతళా మెరిసేటట్లు చేశారు. చివరగా వాటికి ప్లాస్టిక్ కవర్లతో ప్యాకింగ్ చేశారు. వీటిని చూస్తే బ్రాండెడ్ టైర్లేమో అన్నంతగా కనిపిస్తాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘మీ అతి తెలివి తగలెయ్య’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి టైర్లను కొంటే ప్రమాదాలు తప్పవు’’.. అంటూ మరికొందరు, ‘‘టైర్లు కొనే ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.