Share News

Viral: థాయ్‌లాండ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌కు చుక్కలు చూపించిన భారతీయులు.. అమ్మో..మనోళ్లు మామూలుగా లేరుగా..

ABN , Publish Date - Mar 17 , 2024 | 03:42 PM

థాయ్‌ల్యాండ్‌‌లో భారతీయులను ఆడిపోసుకున్న ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు కొందరు భారతీయ యువకులు చుక్కలు చూపించారు.

Viral: థాయ్‌లాండ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌కు చుక్కలు చూపించిన భారతీయులు.. అమ్మో..మనోళ్లు మామూలుగా లేరుగా..

ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌ల్యాండ్‌‌లో (Thailand) భారతీయులను ఆడిపోసుకున్న ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు కొందరు భారతీయ యువకులు చుక్కలు చూపించారు. అతడు భారతీయులకు క్షమాపణలు చెప్పే దాకా వదిలిపెట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral Video) మారింది.

Viral: ట్రాఫిక్‌లో యువతిని అదేపనిగా ఫాలో అయిన ఆటోవాలా.. ఆమె స్కూటీ ఆగిపోగానే ఊహించని విధంగా..

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు కన్నడ యువకులు థాయ్‌లాండ్‌లో ఓ ట్యాక్సీలో బయలుదేరారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ డ్రైవర్ అకస్మాత్తుగా భారతీయులు, భారతదేశంపై నోరుపారేసుకోవడం ప్రారంభించాడు. భారతీయులు పసినారులని తిట్టిపోశాడు. భారత్‌పై కూడా అవాకులుచవాకులు పేలాడు (Thai Taxi driver abuses Indians). వెనక సీట్లో ఉన్న యువకులకు ఇది చూసి తిక్కరేగడంతో అతడికి బుద్ధి చెప్పాలని డిసైడై మొత్తం ఉదంతాన్ని రికార్డు చేశారు.

Viral: దోశ ఆర్డరిచ్చిన మహిళకు భారీ షాక్.. రెండు ముక్కలు తిన్నాక డౌటొచ్చి కిందకు చూస్తే..

ఆ తరువాత వారు కారు దిగి అతడిని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అతడు మాట్లాడిందంతా వీడియోలో రికార్డైందని హెచ్చరించారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. భారతీయులు థాయ్‌లాండ్‌కు రావద్దంటూ బోర్డు పెట్టుకోవాలని విరుచుకుపడ్డారు. యువకుల తీరు చూసి దడుసుకున్న ట్యాక్సీ డ్రైవర్ చివరకు నెత్తిగోక్కుంటూ భారత్‌కు, భారతీయులకు క్షమాపణలు (Apologize) చెప్పి అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాడు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Mar 17 , 2024 | 03:50 PM