Share News

CAA: సీఏఏను రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించవచ్చా.. రాజ్యాంగం ఏం చెబుతోందంటే..

ABN , Publish Date - Mar 14 , 2024 | 03:28 PM

పౌరసత్వ సవరణ చట్టం - సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని ఇప్పటికే వెల్లడించాయి.

CAA: సీఏఏను రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించవచ్చా.. రాజ్యాంగం ఏం చెబుతోందంటే..

పౌరసత్వ సవరణ చట్టం - సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని ఇప్పటికే వెల్లడించాయి. అయితే.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా లేదా, దేశ పౌరసత్వంపై రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా నిర్ణయాలు తీసుకోవచ్చా అనే అంశాలపై నిపుణులు ఆసక్తికర విషయాలు చెబుతున్నాయి. పౌరసత్వం గురించి భారత రాజ్యాంగం ( Constitution ) విపులంగా చర్చించింది. పౌరసత్వం మంజూరు చేసే హక్కు రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం యూనియన్ జాబితాలో ఒక భాగం. దీనిని కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదు. కాబట్టి దేశంలో ఎవరికైనా పౌరసత్వం ఇచ్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.

భారత రాజ్యాంగంలో పౌరుల కోసం చట్టాలను రూపొందించే నిబంధనలను మూడు భాగాలుగా విభజించారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాతో పాటు ఉమ్మడి జాబితాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన చట్టం అమలును కొంతకాలం వాయిదా వేయవచ్చు. కానీ పూర్తిగా నిలుపుదల చేసే హక్కు లేదు. మ్మడి జాబితాలో ఏదైనా చట్టం చేసే ఆ హక్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అయితే ఇందులోనూ అంతిమ నిర్ణయం కేంద్రానిదే. కేంద్రం నిర్ణయానికి రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందే.


రాజ్యాంగంలోని పార్ట్ 2లో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు భారతదేశంలో పౌరసత్వం గురించి వివరించారు. ప్రపంచంలోని చాలా దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని పాటిస్తున్నాయి. అయితే ఆర్టికల్ 9 ప్రకారం భారతదేశం ఆ విధానాన్ని అనుమతించలేదు. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఇతర దేశ పౌరుడిగా మారితే దానిని అనుమతించదు. అతడు భారత పౌరసత్వం కోల్పోతాడు. పౌరసత్వాన్ని ఇవ్వడం, రద్దు చేయడం వంటి అన్ని చట్టాలను రూపొందించడానికి భారత పార్లమెంటుకు పూర్తి అధికారం ఉంటుంది.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 03:28 PM