Viral Video: దుకాణం బయట నిల్చున్న వృద్ధురాలు.. అంతలోనే ఎలా గాల్లోకి లేచిందో చూస్తే.. షాక్ అవుతారు...
ABN , Publish Date - Mar 09 , 2024 | 07:44 PM
అనూహ్య ప్రమాదాలకు సంబధించిన అనేక వీడియోలు.. సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని అయ్యో.. పాపం..! అని అనిపిస్తుంటుంది. కొందరైతే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంటుంటారు. తాజాగా...
అనూహ్య ప్రమాదాలకు సంబధించిన అనేక వీడియోలు.. సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని అయ్యో.. పాపం..! అని అనిపిస్తుంటుంది. కొందరైతే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంటుంటారు. తాజాగా, ఓ వృద్ధురాలికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దుకాణం ముందు నిల్చున్న వృద్ధురాలు.. అంతలోనే గాల్లోకి ఎలా లేవడం చూసి అంతా.. షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. యూకే (UK) సౌత్ వేల్స్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు (old woman) .. స్థానిక రోండా సినాన్ టాఫ్‌లోని స్టోర్‌లో క్లీనర్‌గా పని చేస్తోంది. ఇదిలావుండగా, ఇటీవల ఓ రోజు ఆమె పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి వెళ్లే క్రమంలో దుకాణం బయటికి వచ్చి డోరు వద్ద నిల్చుని ఉంటుంది. అదే సమయంలో దుకాణ యజమాని షట్టర్‌ను పైకి ఎత్తేస్తాడు. అయితే వృద్ధురాలి కోటు షట్టర్‌కు తగులుకుని ఉండడంతో షట్టర్‍తో పాటూ ఆమె కూడా గాల్లోకి లేచింది.
ఊహించని ఈ ఘటనతో ఆమె షాక్ అయింది. అయినా భయపడకుండా ఓ చేత్తో అక్కడి స్టాండ్‌ను పట్టుకుని, మరో చేత్తో తన బ్యాగును పట్టుకుని ఉంటుంది. ఇలా చాలా సేపు ఆమె షట్టర్‌కు వేలాడుతూ ఉంటుంది. అది గమనించిన ఓ వ్యక్తి పరుగు పరుగున అక్కడికి వచ్చి ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె ఎలాంటి గాయాలూ కాకుండా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడుతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం..!’’.. అంటూ కొందరు, ‘‘దుకాణ యజమాని కనీసం చూసుకోకుండా ఇలా చేయడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 60 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral: రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన డ్రైవర్.. లారీని శుభ్రం చేస్తుండగా వచ్చిన ఆ ఒక్క ఆనుమానమే..