Share News

Viral News: ప్రపంచంలోనే డేంజరస్ ఎయిర్‌పోర్ట్.. ఇక్కడ ల్యాండ్ చేయడం సవాలే

ABN , Publish Date - Sep 22 , 2024 | 03:53 PM

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ స్ట్రిప్‌లలో భూటాన్‌లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. హిమాలయాలకు ఆనుకుని ఉన్న పర్వతాల నడుమ ఈ విమానాశ్రయం ఉంది

Viral News: ప్రపంచంలోనే డేంజరస్ ఎయిర్‌పోర్ట్.. ఇక్కడ ల్యాండ్ చేయడం సవాలే

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ స్ట్రిప్‌లలో భూటాన్‌లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. హిమాలయాలకు ఆనుకుని ఉన్న పర్వతాల నడుమ ఈ విమానాశ్రయం ఉంది. దాదాపు 18 వేల అడుగుల లోతులో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్‌లో క్షేమంగా ల్యాండ్ కావడం పైలట్లకు పెద్ద సవాల్. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మంది జెట్ పైలట్లు మాత్రమే ఈ ప్రాంతంలో క్షేమంగా ల్యాండ్ అయ్యేలా శిక్షణ పొందారు. దీని రన్ వే 7,431 అడుగుల పొడవు ఉంటుంది.

అయితే కేవలం చిన్న విమానాలకు మాత్రమే ఇది సరిపోతుంది. ఇక్కడ ల్యాండ్ కావడానికి ప్రత్యేక శిక్షణ, రాడార్ అవసరం లేకుండా ల్యాండ్ చేయగలిగే సామర్థ్యం అవసరం. చిన్నతప్పు జరిగినా.. విమానం కూలిపోయే ప్రమాదం ఉంది. పారోలో విజయవంతంగా ల్యాండ్ చేయగల క్వాలిఫైడ్ పైలట్‌లను ఏవియేషన్ డేర్‌డెవిల్స్‌ అని పిలుస్తారు.


97 శాతం భూభాగం పర్వతాలతో నిండి ఉన్న భూటాన్‌లో విమాన ల్యాండింగ్ అనేది సవాళ్లతో కూడిన పని. ఇక్కడ తరచూ వాతావరణ మార్పులు సంభవిస్తుంటాయి. దీంతో విమానం నడిపే పైలట్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వర్షాకాలం కావడంతో తరచు గోల్ఫ్ బంతుల పరిమాణంలో వడగళ్లు కురుస్తుంటాయని అధికారులు తెలిపారు. ఇది పైలట్లకు మరో సవాల్. దీనికితోడు చైనా నుంచి బలమైన వాయువ్య, ఈశాన్య గాలులు వీస్తుంటాయి. ఇక్కడ రాడార్ పని చేయదు. దీంతో రాత్రుల్లో విమాన ప్రయాణానికి ఇక్కడ అనుమతి ఉండదు. అందుకే రాత్రుళ్లు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించారు.

Updated Date - Sep 22 , 2024 | 03:53 PM