Viral: బ్రిటన్‌లో ఉండలేనంటూ తిరిగొచ్చిన భారతీయ డాక్టర్! కారణం తెలిస్తే..
ABN , Publish Date - Dec 26 , 2024 | 02:25 PM
బ్రిటన్‌లో ఆదాయం తక్కువ కావడంతో అక్కడ ఉండలేక ఓ ఎన్నారై డాక్టర్ భారత్‌కు తిరిగొచ్చారు. ఆయన ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: కెరీర్‌లో ఎదిగేందుకు అపారమైన అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం, సౌకర్యవంతమైన జీవితం.. ఇలా ఎన్నో ఆశించి భారతీయులు విదేశాల బాట పడుతున్నారు. యూఎస్ఏ, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు పెద్ద సంఖ్యలో వలసపోతున్నారు. ఇలా కోటి కలలతో బ్రిటన్‌కు వెళ్లిన ఓ యువ భారతీయ డాక్టర్ అక్కడ ఉండలేనంటూ స్వదేశానికి తిరిగొచ్చారు. తన నిర్ణయానికి కారణమైన పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తూ ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral) .
Viral: భార్య కోసం వీఆర్ఎస్.. ఫేర్‌వెల్ పార్టీలో మహిళ మృతి
తన ఆశలు, కలలు ఎలా కల్లలైందీ చెబుతూ సదరు డాక్టర్ రెడిట్‌లో ఓ పోస్టు పెట్టారు. బ్రిటన్‌కు సంబంధించి కఠోర వాస్తవాల్నీ కొందరు అంగీకరించేందుకు ముందుకు రారరని చెప్పుకొచ్చారు. ‘‘నేను ఓ భారతీయ డాక్టర్‌ని. బ్రిటన్‌లో నాకు మంచి కెరీర్ అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం, సౌకర్యవంతమైన జీవితం లభిస్తుందని అనుకున్నా. పీఎల్ఏబీ పాసయ్యా. కానీ కొంతకాలంగా బ్రిటన్‌లో ఉంటూ అక్కడి హెల్త్‌కేర్ వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులను చూశాక నాకు వాస్తవం ఏంటో అర్థమైంది’’
‘‘విదేశీ డాక్టర్లకు బ్రిటన్ ఓ అవకాశాల స్వర్గధామం అన్న భావన వ్యాప్తిలో ఉంది. కానీ వాస్తవం చాలా సంక్లిష్టమైంది. అధికపని ఒత్తిడి, చాలీచాలని జీతాలతో నరకం కనిపిస్తుంది. ఎన్‌హెచ్ఎస్‌లోని యువ డాక్టర్లు ఎక్కువ సమయం పని చేస్తూ తక్కువ జీతం పొందుతారు. వైద్య వ్యవస్థలో వారిది కీలకపాత్ర అయినా కూడా పనికి తగిన గుర్తింపు ఉండదు. పరిమితమైన వనరులతో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాలి. అసంతృప్తి, అలసట పెరిగిపోతుంది. పని ఒత్తిడి, పనిప్రదేశంలో కొరవడిన మద్దతు వంటివన్నీ తీవ్ర అసహనానికి గురి చేస్తాయి’’ అని చెప్పుకొచ్చారు.
Viral: భర్త నుంచి విడాకుల కోసం సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి మాస్టర్ ప్లాన్!
బ్రిటన్‌లో డాక్టర్ల నెలవారీ శాలరీ 2300 పౌండ్లు చూడటానికి గొప్పగానే కనిపించినా అక్కడి ఖర్చులకు ఇదేమాత్రం సరిపోదని చెప్పుకొచ్చారు. అధిగ జీవన వ్యయాలు, అద్దెలు, పచారీ ఖర్చులు వంటివాటి కారణంగా వచ్చే జీతం సరిపోదని చెప్పుకొచ్చారు. దీంతో, ఆర్థిక స్వేచ్ఛ, ఉద్యోగ జీవితం మధ్య సమతౌల్యం, సంతృప్తి కోసం తాను భారత్‌కు తిరిగొచ్చేశానని చెప్పుకొచ్చారు. ఇండియాలో ఖర్చులు తక్కువని, ఇళ్ల అద్దెలు కూడా అందుబాటులోనే ఉన్నాయని వివరించారు.
‘‘కేవలం డబ్బే కాదు.. ఇక్కడ మెరుగైన జీవితం లభిస్తుందనే భారత్‌కు తిరిగొచ్చాను. ఇక్కడే మంచి అవకాశాలు ఉన్నాయని నాకు అనిపించింది. యూకేలో మాత్రం ఆర్థికపురోగతి లేమి, ఒత్తిడితో కునారిల్లుతున్న వైద్య వ్యవస్థ, పెరిగిన జీవనవ్యయాలు ఉన్నాయి. ఎన్నో కలలతో బ్రిటన్‌కు వెళ్లిన నాలాంటి వైద్యులకు వాస్తవం కఠోరంగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. బ్రిటన్‌కు వెళ్లాలనుకునేవారు ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి రావాలని సూచించారు.
Viral: లగ్జరీ కారులో అకస్మాత్తుగా మంటలు! ‘రేమండ్స్’ అధినేత గుస్సా!