Viral Video: ఫోన్ మాయలో పడిపోయిన భార్య.. భర్త ఇంటికొచ్చి పరిశీలించగా.. బయటపడిన నిర్వాకం..
ABN , Publish Date - Mar 31 , 2024 | 04:01 PM
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మనిషి ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేకపోతున్నాడు. ఆఖరికి నిద్రపోతున్న సమయంలోనూ పక్కనే ఫోన్ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరైతే ఫోన్ మాయలో పడి చుట్టూ ఏం జరుగుతోందన్న కనీస స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి...
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మనిషి ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేకపోతున్నాడు. ఆఖరికి నిద్రపోతున్న సమయంలోనూ పక్కనే ఫోన్ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరైతే ఫోన్ మాయలో పడి చుట్టూ ఏం జరుగుతోందన్న కనీస స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఇంటికి వచ్చిన భర్త.. ఫోన్ మాయలో పడిపోయిన భార్య చివరకు ఏం తెలిసిందో తెలుసుకుని షాక్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) ఇంట్లో కూరగాయలు తరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఆమెకు ఫోన్ రావడంతో, ఓ వైపు ఫోన్ మాట్లాడుతూనే... మరోవైపు కూరగాయలు తరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఆమె కొడుకు ఎదురుగా కూర్చుని ఆడుకుంటుంటాడు. ఇంతవరకూ బాగానే ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతూనే ఉన్న ఆమె.. కూరగాయలు తరగడం పూర్తవగానే వాటిని ఓ పాత్రలో వేస్తుంది. చివరకు ఆ పాత్రను ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సి ఉండగా.. అది కాస్త రివర్స్ అయింది. ఫోన్ మాయలో పడిపోయిన ఆమె.. కూరగాయల పాత్రను బదులుగా.. పిల్లాడిని ఎత్తుకుని ఫ్రిడ్జ్‌లో (fridge) లోపల పెట్టి డోరు వేసేస్తుంది. తర్వాత కూడా ఆమె ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది.
Viral Video: వామ్మో..! ఇది నోరా.. లేక నీటి కొళాయా..
ఇంతలో ఆమె భర్త ఇంటికి వస్తాడు. సోఫాలో కూర్చున్న కాసేపటికి.. ‘‘పిల్లాడేడీ కనిపించలేదు’’.. అని భార్యను అడుగుతాడు. ఆ మాటకు ఆమె వాస్తవ ప్రపంచంలోకి వచ్చి.. అటూ ఇటూ వెతికి చివరకు ఏడుస్తూ కూర్చుంటుంది. ఈ క్రమంలో భర్త ఫ్రిడ్జ్ డోరు తీసి చూడగా.. పిల్లాడు లోపల ఏడుస్తూ ఉంటాడు. భార్య చేసిన పనికి చివరికి అతను షాక్ అవుతాడు. చూస్తుంటే.. ఇదంతా కావాలనే చిత్రీకరించినట్లు ఉన్నా.. సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నట్లుగా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్ మాయలో పడితే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ప్రస్తుతం చాలా మంది ఇలాగే మారిపోయారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో..! నీళ్లు తాగడం ఇంత కష్టమా.. ఈ జిరాఫీ పడుతున్న ఇబ్బందులు చూస్తే..