Share News

Travelling: ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండటానికి ఈ చిట్కాలు మీకోసం..

ABN , Publish Date - Feb 11 , 2024 | 02:55 PM

బిజీ బిజీ లైఫ్ లో కాస్త రిలాక్స్ తీసుకుని ఎక్కడికైనా వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు. నచ్చిన ప్లేస్ కి వెళ్లి కొంత సమయం గడపాలని చాలా మంది అనుకుంటుంటారు. దీంతో తీరిక చేసుకుని ట్రిప్ లు ప్లాన్ చేసుకుంటుంటారు.

Travelling: ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండటానికి ఈ చిట్కాలు మీకోసం..

బిజీ బిజీ లైఫ్ లో కాస్త రిలాక్స్ తీసుకుని ఎక్కడికైనా వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు. నచ్చిన ప్లేస్ కి వెళ్లి కొంత సమయం గడపాలని చాలా మంది అనుకుంటుంటారు. దీంతో తీరిక చేసుకుని ట్రిప్ లు ప్లాన్ చేసుకుంటుంటారు. వెళ్లాల్సిన ప్లేస్ ను బట్టి ప్లాన్ చేసుకుంటారు. అయితే.. ఇలా ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రయాణాల్లో శారీరక అలసట ఉంటుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాకే విహారానికి వెళ్లడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణాల్లో ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రయాణంలో హైడ్రేట్ గా ఉండటం చాలా అవసరం. ఎప్పటికప్పుడు నీటిని సిప్ చేస్తూ ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అల్పాహారం తినాలి. ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు కలిగించే అల్పాహారాన్ని తీసుకోకపోవడం ఉత్తమం. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహారాన్ని వెంట తీసుకెళ్లాలి. ట్రిప్ లో చాలా వరకు నడవాల్సిన పని ఉంటుంది. దీంతో ఆహారం చాలా త్వరగా జీర్ణమవుతుంది. ఫలితంగా తక్కువ టైమ్ లోనే మనకు ఆకలి వేస్తుంది. అందుకే పాడైపోని చిరుతిళ్లను వెంట తీసుకెళ్లాలి. బిస్కెట్లు, వాటర్ బాటిల్ ను అస్సలు మర్చిపోవద్దు. జంక్ ఫుడ్‌ను వీలైనంత దూరంగా ఉండటం ఉత్తమం.


మీరు ఆహార ప్రియులైతే మీరు ప్రయాణించే ప్రాంతంలోని ఆహారాన్ని ట్రై చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ ప్రాంతంలోని సంస్కృతి, భిన్నత్వం తెలుస్తాయి. ట్రిప్ అంటే కేవలం ప్రయాణం మాత్రమే కాదు.. అందరితో కలిసిపోవడం అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే పర్యటనలో మంచి ఫలితాలు పొందవచ్చు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 02:55 PM