Share News

Viral news: 60 ఏళ్ల కష్టాలకు తెరదించిన లక్కీ డ్రా.. హైదరాబాద్ వాసికి భారీ జాక్ పాట్..

ABN , Publish Date - Dec 28 , 2024 | 07:13 AM

హైదరాబాద్‌కు చెందిన రాజమల్లయ్య(60) చిన్నప్పట్నుంచీ పేదరికంలోనే పెరిగారు. పెళ్లి తర్వాతైనా మార్పు వస్తుందనుకుంటే కుటుంబ భారం మరింత ఎక్కువైంది. రోజువారీ కూలీగా చిన్నచిన్న పనుల ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు.

Viral news: 60 ఏళ్ల కష్టాలకు తెరదించిన లక్కీ డ్రా.. హైదరాబాద్ వాసికి భారీ జాక్ పాట్..
Big Ticket Millionaire Electronics lucky draw

హైదరాబాద్: నగరానికి చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. చిన్నప్పట్నుంచీ పేదరికంలో మగ్గిపోయిన అతనికి భారీ జాక్ పాట్ తగిలింది. కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతానా?, జీవితంలో కొత్త వెలుగులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూసిన ఆ వ్యక్తికి ఆ రోజు రానే వచ్చేసింది. 30 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ధనలక్ష్మి ఆ పేదవాడి ఇంట్లోకి ప్రవేశించింది. 60 ఏళ్ల వయసులో తనకు దక్కిన అదృష్టం చూసి అతను ఉబ్బితబ్బిపోతున్నాడు. అసలు ఎవరీ వ్యక్తి, అతనికి తగిలిన ఆ జాక్ పాట్ ఏంటి?, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


హైదరాబాద్‌కు చెందిన రాజమల్లయ్య(60) చిన్నప్పట్నుంచీ పేదరికంలోనే పెరిగారు. పెళ్లి తర్వాతైనా మార్పు వస్తుందనుకుంటే కుటుంబ భారం మరింత ఎక్కువైంది. రోజువారీ కూలీగా చిన్నచిన్న పనుల ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు. దీంతో ఏం చేయాలో పాలుపోక జీవితం దుర్భరంగా మారిపోయింది. అయితే తనకు తెలిసిన ఓ వ్యక్తి లాటరీ టికెట్ కొంటే జీవితం మారిపోతుందని చెప్పాడు. ఒక్కసారి లాటరీ తగిలిందంటే పెద్దమెుత్తంలో డబ్బు వస్తుందని చెప్పాడు. దీంతో రాజమల్లయ్య ఏళ్లుగా లాటరీ కొంటూ వచ్చారు. అయినా ఏ రోజూ అదృష్టం అతని వంక చూడలేదు.


పిల్లలు పెద్ద కావడం, కుటుంబ భారం ఎక్కువ కావడంతో మరింత ఆదాయం సంపాదించేందుకు దుబాయ్ వెళ్లాలని రాజమల్లయ్య నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పాస్ పోర్ట్ తీసుకుని అక్కడికి వెళ్లారు. ఓ ఇంట్లో వాచ్‌మెన్‌గా జాయిన్ అయ్యారు. అయినప్పటికీ లాటరీలు కొనే విషయంలో అతను ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇటీవల బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్స్ లక్కీ డ్రాకు సంబంధించి టికెట్ కొన్నారు.


అయితే తాజాగా ఆ సంస్థ లక్కీ డ్రాను ప్రకటించింది. దీంట్లో రాజమల్లయ్యకు మిలియన్ దిర్హామ్స్ దక్కాయి. అంటే మన కరెన్సీలో అది రూ.2.32 కోట్లకు సమానం. ఇంత పెద్దమెుత్తంలో లాటరీ తగలడంతో రాజమల్లయ్య ఎగిరి గంతేశారు. 30 ఏళ్లుగా లాటరీ కొంటుంటే ధనలక్ష్మి ఇప్పుడు వరించిందని తెగ సంబర పడిపోతున్నారు. ఇక తన కష్టాలు తీరనున్నాయని, ఈ నగదు మెుత్తాన్ని కుటుంబం, బంధువులతో పంచుకోనున్నట్లు రాజమల్లయ్య చెబుతున్నారు. కాగా, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Viral Video: చిరుతపులిపై మొసలి దాడి.. చివరకు జూమ్ చేసిన చూడగా దిమ్మతిరిగే సీన్..

Viral Video: ఇతడి స్పీడ్ ముందు మిషిన్ కూడా దిగదుడుపే.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Updated Date - Dec 28 , 2024 | 08:21 AM