Share News

Salt Expiration: ఉప్పుకు కూడా గడువు తేదీ ఉంటుందా.. నిజమేనా..

ABN , Publish Date - Dec 11 , 2024 | 09:30 PM

ఉప్పు లేకుండా ఎలాంటి ఆహారమైనా కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. అయితే ప్రతి రోజు వంటల్లో ఉపయోగించే ఈ ఉప్పుకు గడువు తేదీ ఉందా. ఉంటే ఎన్నేళ్లు ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Salt Expiration: ఉప్పుకు కూడా గడువు తేదీ ఉంటుందా.. నిజమేనా..
Salt expiration date

ఆహారంలో ఉప్పు (salt) లేకపోతే, అది తినడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. మరికొంత మంది మాత్రం ఆహారంలో ఉప్పు కొంచెం తక్కువైనా కూడా వెంటనే ఉప్పు వేసుకుంటారు. ఇలా ఏ వంటకం చేసినా, కూరగాయలు కడిగినా కూడా ఉప్పు వాడాల్సిందే. అయితే నూనె, మసాలాలు, కూరగాయలు, పప్పులతో సహా వంటగదిలోని ప్రతీది ఏదో ఒక సమయంలో పాడైపోవడం లేదా గడవు తేదీ ఉండటం చూస్తుంటాం. కానీ ఉప్పు ఎప్పుడైనా చెడిపోవడం చుశారా. దీనికి గడువు తేదీ ఉందా? చాలా మందికి ఉప్పుకు గడువు తేదీ ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఆరోగ్యానికి కూడా..

ఉప్పు లేకుండా దాదాపు ఏ ఆహారం కూడా ఉండదు. ఉప్పు లేకపోతే ఆహారం లేదా వంటకం రుచి ఉండదు. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయకరిగా ఉంటుంది. ఎందుకంటే ఉప్పు ఒక ఖనిజం. ఇది సోడియం క్లోరైడ్ నుంచి తయారవుతుంది. దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ డీ వంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి.


గడవు తేదీ ఉందా..

తినదగిన ఉప్పు సోడియం క్లోరైడ్‌తో తయారు చేయబడుతుంది. దీని రసాయన దృక్పథం స్థిరంగా ఉంటుంది. దీనర్థం సమయం ఉప్పుపై ఎలాంటి ప్రభావం చూపదు. కాబట్టి ఉప్పుకు ఎలాంటి గడవు తేదీ లేదు. అంతేకాదు అందులో బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఏర్పడకపోవడం ఉప్పు ప్రత్యేకత. బ్యాక్టీరియా పెరగడానికి తేమ అవసరం. స్వచ్ఛమైన ఉప్పు ఎప్పుడూ నీటిని కలిగి ఉండదు. ఉప్పు చెడిపోకపోవడానికి ఇదే కారణమని చెప్పవచ్చు.


ఎందుకు చెడ్డది కాదు?

అనేక రకాల సూక్ష్మజీవులకు ఉప్పు ప్రమాదకరం. అందుకే అది ఎప్పుడూ చెడిపోదు. నేషనల్ అకడమిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం ఏదైనా ఉప్పు కలిపిన తర్వాత సూక్ష్మజీవుల కణాలు ద్రవాభిసరణ షాక్‌కు గురవుతుంది. ఈ కారణంగా సూక్ష్మజీవుల కణాలు ఉప్పులో ఎప్పటికీ పెరగవు. దీంతో ఉప్పు చెడిపోకుండా ఉంటుంది.


ఉప్పు ఎందుకు పాడవుతుంది

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం స్వచ్ఛమైన ఉప్పు ఎప్పుడూ చెడిపోదు. అదే సమయంలో శుద్ధి చేసిన సముద్రపు ఉప్పులో కొంత సముద్రపు నాచు ఉంటుంది. ఈ రకమైన ఉప్పును మూడేళ్లపాటు ఉపయోగించుకోవచ్చు. ఉప్పు నాణ్యత తగ్గినప్పటికీ ఆహారంలో ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. ఇళ్లలో ఉపయోగించే అయోడైజ్డ్ ఉప్పులో అయోడిన్ రసాయనం ఉంటుంది. టేబుల్, కోషెర్ ఉప్పులో యాంటీ-కేకింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి కాలక్రమేణా క్షీణతకు కారణమవుతాయి. దీని వల్ల ఉప్పులో తేమ చేరి, అందులో గడ్డలు ఏర్పడటం మొదలవుతుంది.


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 11 , 2024 | 09:32 PM