Share News

Viral video: ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడికి షాకింగ్ అనుభవం.. కరవరానిచోట కరచిన పాము.. చివరకు..

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:38 PM

ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ప్రధానంగా రాత్రి వేళల్లో విష పరుగులు పొంచి ఉండే ప్రమాదం ఉంటుంది. ఇక ట్రెక్కింగ్ చేసే వారైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు...

Viral video: ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడికి షాకింగ్ అనుభవం.. కరవరానిచోట కరచిన పాము.. చివరకు..

ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ప్రధానంగా రాత్రి వేళల్లో విష పరుగులు పొంచి ఉండే ప్రమాదం ఉంటుంది. ఇక ట్రెక్కింగ్ చేసే వారైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ పాములు దాడి చేస్తాయో తెలీని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ట్రెక్కింక్ వెళ్లిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ పాము కరవరానిచోట కరవడంతోచివరకు ఏం జరిగిందో చూడండి..


ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ట్రెక్కింగ్‌కు (Trekking) వెళ్లిన ఓ వ్యక్తి్కి షాకింగ్ అనుభవం ఎదురైంది. కొండల్లోకి వెళ్లిన యువకుడు అక్కడి అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ఓ పెద్ద పాము అతడి కాలును చుట్టేసింది. అంతటితో ఆగకుండా పైదాకా వచ్చి అతడి (snake bite on man private part) జననాంగాల వద్ద కాటు వేసింది.

Viral video: పొట్టేళ్లు కూడా దొంగ దెబ్బ తీయగలవు.. ఇతడితో ఎలా ఆడుకున్నాయంటే..


పాము కాటేయడంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఊహించని విధంగా పాము కాటు వేయడంతో దాన్నుంచి తప్పించుకునేందుకు ఎంతో శ్రమించాడు. పాము తల పట్టుకుని పక్కకు లాగేయాలని ప్రయత్నించాడు. అయినా పాము అతన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంది. దీంతో అతను నొప్పి తాళలేక కేకలు పెడుతూ చివరకు ఎలాగోలా పామును పక్కకు విసిరేశాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral video: రాళ్లను పగులగొడుతుండగా కలిసొచ్చిన అదృష్టం.. అడుగున అనుమానాస్పదంగా ఉండడంతో..


కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇలాంటి దారుణం ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘అది విషపూరితం కాకపోవచ్చు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: పులి నుంచి తప్పించుకోవడానికి కొండముచ్చుల పక్కా స్కెచ్.. సడన్‌గా ఎటాక్ చేయడంతో చివరకు..

Updated Date - Jun 09 , 2024 | 04:38 PM