Watch Video: అద్భుతం.. నిర్జీవంగా పడిన పక్షిని సీపీఆర్‌తో కాపాడిన మరో పక్షి..
ABN , Publish Date - Jul 31 , 2024 | 07:53 PM
Viral Video: ఎవరైనా ఉన్నట్లుండి కుప్పకూలిపోతే ముందుగా మనం చేయాల్సిన పని.. వారి పల్స్ చూసి సీపీఆర్ చేయాలి. సీపీఆర్ చేయడం ద్వారా బాధిత వ్యక్తులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం.. ఒక్క సారిగా కిందపడిపోయిన వ్యక్తిని సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
Viral Video: ఎవరైనా ఉన్నట్లుండి కుప్పకూలిపోతే ముందుగా మనం చేయాల్సిన పని.. వారి పల్స్ చూసి సీపీఆర్ చేయాలి. సీపీఆర్ చేయడం ద్వారా బాధిత వ్యక్తులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం.. ఒక్క సారిగా కిందపడిపోయిన వ్యక్తిని సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనుషులే కాదండోయ్.. ప్రాణాపాయంలో ఉన్న సహచర జీవిని కాపాడుకోవడం తమకూ తెలుసు అంటున్నాయి పక్షులు. సీపీఆర్ మనుషులే కాదు.. మేమూ చేస్తామని తాజాగా ఓ పక్షి చేసి నిరూపించింది. అవును, ఉన్నట్లుండి కుప్పకూలిన ఓ పక్షికి సీపీఆర్‌తో ప్రాణం పోసింది మరో పక్షి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజల హృదయాలను కొల్లగొట్టేస్తుంది.
ఇటీవలి కాలంలో చాలా మంది ప్రజలు ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఆడుతూ, పాడుతూనే గుండెపోటుతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా తరువాత దేశంలో రోజూ ఏదో ఒక మూలన ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అందుకే.. వైద్యులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. మీ ముందు ప్రజలెవరైనా ఇలా అకస్మాత్తుగా పడిపోయినట్లయితే వెంటనే సీపీఆర్ చేయాలని, తద్వారా వారిని బ్రతికించొచ్చని చెబుతున్నారు. అందుకే.. సీపీఆర్‌పై నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు.. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలతో బయటపడిన వారు ఎందరో ఉన్నారు. అయితే, ఇదే సీపీఆర్ ద్వారా ఓ పక్షి మరో పక్షిని కాపాడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో పిట్ట ఏం చేసిందో తెలుసుకుందాం.
మనుషులే కాదు.. పక్షులకూ సీపీఆర్ తెలుసు..!
వైరల్ అవుతున్న వీడియోలో ఓ పక్షి కొన ప్రాణాలతో కింద పడిపోయి ఉంది. దీనిని గమనించిన సహచర పక్షి.. బాధిత పక్షిని బతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ప్రాణాపాయంలో ఉన్న పక్షిని అటు ఇటూ దొర్లిస్తూ.. దాని నోట్లో నోరు పెట్టి ఊపిరి అందించే ప్రయత్నం చేసింది. స్పృహ కోల్పోయిన పక్షిని వెల్లకిగా చేసి.. తన కాళ్లతో గుండెపై ఒత్తిడి చేసింది. ఆ పక్షిని బతికించేందుకు చాలా సేపు ప్రయత్నాలు చేసింది. చివరకు దాని ప్రయత్నాలు ఫలించాయి. ఉలుకు పలుకు లేకుండా పడిపోయిన పిట్టలో కాస్త చలనం వచ్చింది. ఆ కాసేపటికే పూర్తి స్థాయిలో కోలుకుంది. పైకి లేచి తుర్రుమని ఎగిరిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.
ఆలోచించదగ్గ వీడియో..
వీడియోను షేర్ చేసిన నెటిజన్ ‘‘ఊరపిచ్చుక ఒకటి ఎగురుతూ ఎగురుతూ క్రింద పడిపోయింది ... దాని శ్వాస కూడా ఆగిపోయింది.. తన సహా పక్షి సిపిర్ (cardio pulmonary resuscitation)చదువలేదు. కానీ తన తోటి పక్షి జీవితాన్ని కాపాడగలిగింది.. అద్భుతమైన సృష్టి.. ఆలోచించదగ్గ వీడియో.. 👌’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. నిజమే కదా.. ఈ వీడియో తప్పకుండా ఆలోచింపజేసేదే. ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది. మరెందుకు ఆలస్యం.. ఈ హృదయానికి హత్తుకునేలా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి.