Viral: వీళ్లు నిజంగా గ్రేట్.. తల్లికి దూరమైన నక్క పిల్లకు పాలు పట్టేందుకు..
ABN , Publish Date - Mar 14 , 2024 | 05:29 PM
పిల్ల నక్క సంరక్షణ కోసం రిచ్‌మండ్ వైల్డ్‌లైఫ్ సెంటర్ సిబ్బంది తీసుకుంటున్న చర్యల తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలకు కన్నతల్లికి మించిన ఆప్తులు మరొకరు ఉండరు. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని సార్లు తల్లికి దూరమైన జీవాలు అనేక అవస్థలు పడుతుంటాయి. అలాంటి దీని స్థితిలో ఉన్న ఓ నక్క పిల్లను జంతుసంరక్షకులు సాకుతున్న తీరు నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. అమెరికాలోని (USA) వర్జీనియా రాష్ట్రంలో గల రిచ్‌మండ్ వైల్డ్‌లైఫ్ సెంటర్‌లో (Richmond Wildlife center) ఈ ఉదంతం వెలుగు చూసింది.
Viral: ఇంటర్వ్యూకు వచ్చిన యువతి కోరిక విని నోరెళ్లబెట్టిన కంపెనీ సీఈఓ!
ఓ నక్క పిల్ల పుట్టిన కొన్ని గంటల్లోనే అనాథగా మారింది. కంటి చూపు, వినికిడి లేని శైశవ దశలో ఉన్న దాన్ని కొందరు కాపాడి రిచ్‌మండ్ సెంటర్‌కు తీసుకొచ్చారు. అయితే, తొలుత ఆ చిన్ని జీవిని చూసి అందరూ పిల్లి పిల్ల అని అనుకున్నారు. కాస్తంత నిశితంగా పరిశీలించగా అది నక్క పిల్ల అని బయటపడింది. అది అడవి జంతువు కాబట్టి దానిపై మనుషుల ప్రభావం పడకుండా చూడాలని అక్కడి జంతు సంరక్షకులు నిర్ణయించారు. ఈ క్రమంలో నక్కలను పోలిన మాస్కులు ధరించి నక్క పిల్లకు పాలు పట్టారు. మనుషుల శబ్దాలేవీ దానికి వినబడకుండా చేశారు. మనుషులు దాని కంట పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పిల్ల నక్క వీడియో కూడా నెట్టింట షేర్ చేశారు. పెద్దయ్యాక దాన్ని మళ్లీ అడవిలో వదిలిపెట్టేస్తామని చెప్పారు (Feeding foxcub with masks on).
Gold: ఈ కారణంతో బంగారు నగలు కొంటున్నారంటే... తప్పు చేస్తున్నట్టే!
నక్కను రక్షించేందుకు జంతు సంరక్షకులు తీసుకుంటున్న చర్యలు చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. జంతుసంరక్షణశాల సిబ్బందిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు రిచ్‌మండ్ వైల్డ్ లైఫ్ సెంటర్ మరో అప్‌డేట్ చేసింది. పిల్ల నక్క బాగా కోలుకుందని పేర్కొంది. ఈ జర్నీలో తమకు మద్దతునిచ్చిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి