Share News

Viral news: టాయిలెట్‏కు వెళ్లాలంటే పాస్ కావాల్సిందే.. మెట్రోలో వింత రూల్

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:17 PM

రైళ్లలో మరుగుదొడ్డిని ఉచితంగానే వినియోగించుకోవచ్చు. అయితే ముంబయి మెట్రో తీసుకొచ్చిన కొత్త నిబంధన చర్చనీయాంశం అయింది. మెట్రోలో ప్రయాణించేవారు టాయిలెట్ కు వెళ్లాలంటే టాయిలెట్ పాస్ తప్పనిసరిగా నింపాల్సిందేనని కండీషన్ పెట్టింది.

Viral news: టాయిలెట్‏కు వెళ్లాలంటే పాస్ కావాల్సిందే.. మెట్రోలో వింత రూల్

ముంబయి: రైళ్లలో మరుగుదొడ్డిని ఉచితంగానే వినియోగించుకోవచ్చు. అయితే ముంబయి మెట్రో తీసుకొచ్చిన కొత్త నిబంధన చర్చనీయాంశం అయింది. మెట్రోలో ప్రయాణించేవారు టాయిలెట్ కు వెళ్లాలంటే టాయిలెట్ పాస్ తప్పనిసరిగా నింపాల్సిందేనని కండీషన్ పెట్టింది. మెట్రోలో ఒక ప్రయాణికుడికి ఈ అనుభవం ఎదురైంది. తన అనుభవాన్ని రెడ్డిట్ వేదికగా అతను పంచుకున్నాడు. ఆ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ముంబయి మెట్రోలోని మరుగుదొడ్డి ఉపయోగించుకోవాలంటే పేరు, ఫోన్ నంబర్, టికెట్ టోకెన్ నంబర్ నింపాల్సి ఉంటుందని ఆ ప్రయాణికుడు చెప్పాడు. దానికి టాయిలెట్ పాస్ అని పేరు పెట్టారని అన్నాడు. ఈ నిబంధన వల్ల తాను టాయిలెట్ పాస్ తీసుకుని మరుగుదొడ్డిని ఉపయోగించాల్సి వచ్చిందని వాపోయాడు. ఈ నిర్ణయంపై కొందరు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. "మీరు మూత్ర విసర్జన చేయాల్సి వస్తే, తొలుత రుసుము చెల్లించాలి" అని ఒక వినియోగదారుడు రాశాడు.


"మీ మూత్రం, మల నమూనాలను సేకరించడానికి వారికి పేర్లు, ఫోన్ నంబర్లు అవసరం"అని మరొకరు మండిపడ్డారు. "నేను ముంబయి మెట్రోలో ప్రయాణించాను. కానీ మీరు చెబుతున్నట్లు నాకు అలాంటి సంఘటన ఎదురుకాలేదు. నేను ఘాట్‌కోపర్‌లో మెట్రో టాయిలెట్‌ని ఉపయోగించాను. టాయిలెట్ పాస్ తీసుకోవాలని నన్నెవరూ అడగలేదు" అని ఇంకొకరు అన్నారు. ఇలాంటి నిబంధనలను అమలు చేయడం వల్ల ప్రజా సౌకర్యాల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చని మరికొందరు అన్నారు. అయితే మరుగుదొడ్లను ఉపయోగించుకోవాడానికి వ్యక్తిగత సమాచారం అడగడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 'ఇంకా నయం ఆధార్, బయోమెట్రిక్‌లను అడగనందుకు సంతోషంగా ఉంది' అంటూ ఓ వినియోగదారుడు వ్యంగ్యంగా స్పందించాడు.


అసలేంటి ఈ రూల్..

ముంబయి మెట్రోలో టాయిలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసం ఒక నిబంధనను రూపొందించారు. దీని ప్రకారం స్టేషన్ పరిధిలో పెయిడ్ జోన్‌లో ఉన్న వారు మాత్రమే టాయిలెట్‌ ను ఉపయోగించుకోవచ్చు. అందువల్ల జోన్ వెలుపల ప్రయాణిస్తున్న వ్యక్తులు టాయిలెట్‌ను ఉపయోగించలేరు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మెట్రో ‘టాయిలెట్ పాస్’ అనే పద్ధతిని ప్రవేశపెట్టింది. దీంతో సుదూరంగా ప్రయాణిస్తున్న వారు మరుగుదొడ్డిని ఉపయోగించుకోవచ్చు.

Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

CM Revanth: రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం: సీఎం రేవంత్

ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 04:17 PM