Share News

Viral Video: ట్రాఫిక్‌లో చిక్కుకున్న చుక్ చుక్ రైలు.. ఆ తర్వాత ఏమైందంటే..

ABN , Publish Date - Sep 26 , 2024 | 12:44 PM

దేశంలోని ప్రధాన నగరాల్లోనే కాదు పట్టణాల్లో సైతం పద్మవ్యూహాంలో అభిమన్యుడు చిక్కుకున్నట్లు సగటు జీవి చిక్కుకుని పోతున్నాడు. దీంతో ప్రతి మనిషి జీవితంలో కొన్ని గంటలు ట్రాఫ్రిక్‌కు కేటాయించాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. అయితే ఇప్పటి వరకు ట్రాఫిక్‌లో బస్సులు, కారులు, బైకులు తదితర వాహనాలు మాత్రమే చిక్కుకుంటాయన్న సంగతి అందరికీ తెలిందే.

Viral Video: ట్రాఫిక్‌లో చిక్కుకున్న చుక్ చుక్ రైలు.. ఆ తర్వాత ఏమైందంటే..

దేశంలోని ప్రధాన నగరాల్లోనే కాదు పట్టణాల్లో సైతం పద్మవ్యూహాంలో అభిమన్యుడు చిక్కుకున్నట్లు సగటు జీవి చిక్కుకుని పోతున్నాడు. దీంతో ప్రతి మనిషి జీవితంలో కొన్ని గంటలు ట్రాఫ్రిక్‌కు కేటాయించాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. అయితే ఇప్పటి వరకు ట్రాఫిక్‌లో బస్సులు, కారులు, బైకులు తదితర వాహనాలు మాత్రమే చిక్కుకుంటాయన్న సంగతి అందరికీ తెలిందే. ఇప్పుడు ఆ జాబితాలో రైలు సైతం చేరింది.

Also Read: Janasena: బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..


ఇంతకీ ఏం జరిగిందంటే.. బెంగళూరులో రైల్వే ట్రాక్‌పై రైలు నిలిచి ఉంది. ఈ విషయాన్ని ఆ సమీపంలోనే రహదారిపై వెళ్తున్న వాహనదారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా.. ఎవరి గమ్య స్థానాలకు వారు వెళ్లిపోతున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను సుధీర్ చక్రవర్తి అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. “నువ్వు, నేను కాదు.. రైలు కూడా బెంగుళూరు ట్రాఫిక్ నుండి తప్పించుకో లేకపోయిందంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.

Kerala: అన్నా సెబాస్టియన్ తల్లిదండ్రులను పరామర్శించిన ఎంపీ శశిథరూర్


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే ఈ ఘటన బెంగళూరులోని మారతహళ్లి సమీపంలోని మున్నెకోళ్ల రైల్వే క్రాసింగ్ వద్ద చోటు చేసుకుంది.

Also Read: Gold and Silver Rates Today: చరిత్రలోనే తొలిసారి.. భారీగా పెరిగిన బంగారం ధరలు..


మరోవైపు ఈ వైరల్ వీడియోపై ఆగ్నేయ రైల్వే స్పంధించింది. కేరళ వెళ్తున్న ఈ రైలులో సాంకేతిక లోపం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో మున్నెకోళ్ల రైల్వే క్రాసింగ్ వద్ద రైలును నిలిపి లోకో పైలెట్ తనిఖీలు చేపట్టారని వివరణ ఇచ్చింది. అంతేకానీ ట్రాఫిక్‌ సమస్య కాదని ఆగ్నేయ రైల్వే స్పష్టం చేసింది. మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది.

Also Read: 3D Printed Hotel: ప్రపంచంలోనే తొలి త్రీడి ప్రింటింగ్ హోటల్


యశ్వంత్‌పూర నుంచి కుచ్‌వేలి గరీభ్‌రథ్ రైలు బన్స్‌వాడీ స్టేషన్ దాటిన కొద్ది నిమిషాలకు ఈ రైలు ట్రాక్ ‌పై నిలిపినట్లు పేర్కొంది. దాదాపు 15 నుంచి 20 నిమిషాల అనంతరం ఈ రైలు తన గమ్యస్థానంవైపు పయమైందని బెంగళూరు రైల్వే డివిజన్ వివరించింది.

For National News And Telugu New...

Updated Date - Sep 26 , 2024 | 01:34 PM