Share News

Optical illusion: ఈ గదిలో దాక్కున్న సీతాకోకచిలుకలను 30 సెకన్లలో కనుక్కోగలరా.. ?

ABN , Publish Date - Sep 28 , 2024 | 02:56 PM

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ గదిలోని వివిధ రకాల వస్తువులను ముగ్గురు వ్యక్తులు పరిశీలిస్తుంటారు. గది మధ్యలో సోఫాలతో పాటూ ఓ టేబుల్, దానిపై పూల కుండీ, టీ సాసర్ తదితర వస్తువులు ఉంటాయి. అయితే మీ కంటికి కనపించకుండా సీతాకోకచిలుకలు కూడా దాక్కుని ఉన్నాయి. వాటిని 30 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి చూద్దాం..

Optical illusion: ఈ గదిలో దాక్కున్న సీతాకోకచిలుకలను 30 సెకన్లలో కనుక్కోగలరా.. ?

ప్రస్తుత దైనందిన జీవితంలో చాలా మంది అనేక రకాల మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి ప్రస్తుత తరుణంలో మైండ్ రిలీఫ్‌ అందించే అనేక సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. వీటిలో కొన్ని పజిల్స్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే అలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. తాజాగా, ఇలాంటి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న గదిలో సీతాకోకచిలుకలు దాక్కుని ఉన్నాయి. వాటిని 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం.


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ గదిలోని వివిధ రకాల వస్తువులను ముగ్గురు వ్యక్తులు పరిశీలిస్తుంటారు. గది మధ్యలో సోఫాలతో పాటూ ఓ టేబుల్, దానిపై పూల కుండీ, టీ సాసర్ తదితర వస్తువులు ఉంటాయి.

Viral Video: పిల్లి పిల్లపై కుక్కల దాడి.. గమనించిన తల్లి ఎలా కాపాడిందో చూస్తే..


అలాగే ఓ వైపు గోడ పక్కన ర్యాక్‌లో పుస్తకాలు, వాటి పక్కన పురాతన గోడ గడియారం, ఆ పక్కనే ఓ వృద్ధుడి ఫొటోతో పాటూ పులి తల బొమ్మను కూడా గోడపై ఏర్పాటు చేసి ఉంటారు. ఇలా అనేక వస్తువులు గదిలో ప్రవర్శనగా ఉంచారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తి.. సడన్‌గా పరుగెత్తుకొచ్చిన మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..


ఇదే గదిలో ఆ వస్తువులతో పాటూ సీతాకోక చిలుకలు కూడా ఉన్నాయి. అయితే అవి మన కంటికి కనిపించకుండా (Hidden Butterflies) దాక్కుని ఉన్నాయి. వాటిని కనిపెట్టాలంటే ఎంతో నిశిత పరిశీలన అవసరం. మనసును, దృష్టిని ఈ చిత్రంపైనే నిలిపి చూస్తే తప్ప.. ఆ సీతాకోక చిలుకలను గుర్తించలేరు.

Optical illusion: ఈ చిత్రంలో రెండు తప్పులేంటో 30 సెకన్లలో కనుక్కున్నారంటే.. మీలో ఏకాగ్రత బాగున్నట్లే..


చాలా మంది నెటిజన్లు ఆ సీతాకోక చిలుకలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే కనుక్కోగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. అవెక్కడ ఉన్నాయో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-phot.jpg

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 28 , 2024 | 02:56 PM