Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పేంటో.. 30 సెకన్లలో చెప్పగలరా..
ABN , Publish Date - Jun 12 , 2024 | 07:09 PM
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ తదితర ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఇలాంటి పజిల్స్ ఫొటోలకు సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి...
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ తదితర ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఇలాంటి పజిల్స్ ఫొటోలకు సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఫొటోలకు సమాధానాలు తెలుసుకోవడం ద్వారా మానసిక సమస్యల నుంచి రిలీఫ్ లభించి, మనలో ఏకాగ్రత మరింత పెరుగుతుంది. అలాగే మెదడుకు వ్యాయామం కూడా అందుతుంది. తాజాగా, మీకోసం ఓ పజిల్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ పజిల్ చిత్రం (Puzzle viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఇనుప రేకుల షెడ్డు కింద పశువువులకు సంబంధించిన గడ్డి ఉంది. అలాగే అటు పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది. అదేవిధంగా ఈ షెడ్డు చుట్టూ చెక్కలతో ఏర్పాటు చేసిన ప్రహరీ కూడా ఉంది. కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో ఈ షెడ్డును నిర్మించినట్లు కనిపిస్తోంది.
Viral video: చిరుతనే బురిడీ కొట్టించిన కుక్క.. ప్రాణాలు పోయే సమయంలో ఎలాంటి ప్లాన్ వేసిందో చూస్తే..
ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే మీ కంటికి ఓ పరీక్ష పెడుతున్నాం. ఈ చిత్రంలో ఓ పెద్ద తప్పు (mistake in the picture) కూడా దాగి ఉంది. అది మన కళ్లకు కనిపిస్తూనే ఉన్నా కూడా.. కనిపెట్టడం మాత్రం కష్టం. కానీ కాస్త దృష్టి పెట్టి చూస్తే మాత్రం ఆ తప్పును పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు.
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న సూదిని 30 సెకన్లలో గుర్తిస్తే.. మీకు కళ్లద్దాలతో పని లేనట్లే..
చాలా మంది ఆ తప్పును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఆ తప్పును గుర్తించేందుకు ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ తప్పును పసిగట్టడం మీకు కష్టంగా ఉంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Viral video: అప్పగింతల సమయంలో అందరికీ షాక్ ఇచ్చిన వధువు.. చివరకు చుట్టూ అంతా చేరి..