Share News

Viral: ఖరీదైన హోటల్లో గది బుక్ చేసుకున్న మహిళ.. ఉదయం లేవగానే తన ఒంటిపై చూసుకోగా.. షాకింగ్ సీన్..

ABN , Publish Date - Jun 11 , 2024 | 09:13 PM

ఖరీదైన హోటళ్లలో గదులు బుక్ చేసుకునే సందర్భాల్లో కొన్నిసార్లు కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. గదుల్లో ఏర్పాట్లు సరిగా లేకపోవడం, ఆహారం నాణ్యతగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఒకవేళ...

Viral: ఖరీదైన హోటల్లో గది బుక్ చేసుకున్న మహిళ.. ఉదయం లేవగానే తన ఒంటిపై చూసుకోగా.. షాకింగ్ సీన్..
ప్రతీకాత్మక చిత్రం

ఖరీదైన హోటళ్లలో గదులు బుక్ చేసుకునే సందర్భాల్లో కొన్నిసార్లు కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. గదుల్లో ఏర్పాట్లు సరిగా లేకపోవడం, ఆహారం నాణ్యతగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఒకవేళ అన్నీ సక్రమంగా ఉన్నా సిబ్బంది నిర్వాకం సరిగా లేకపోవడమో జరుగుతుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఖరీదైన హోటల్లో గది బుక్ చేసుకున్న ఆమె.. ఉదయం లేవగానే తన శరీరంపై చూసుకుని షాక్ అయింది.


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని (United Kingdom) బ్లాక్‌పూల్‌ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. షారపన్ హస్లామ్ అనే మహిళ (woman) .. తన స్నేహితురాలు పుట్టిన రోజు ఉండడంతో స్థానికంగా ఉన్న ఓ ఖరీదైన హోటల్లో రెండు రోజుల పాటు గది బుక్ చేసుకుంది. ఇందుకోసం ఆమె మొత్తం రూ.17,000లు చెల్లించింది. అందుకు తగ్గట్టుగానే గదిలో కూడా ఏర్పాట్లు లగ్జరీగా ఉన్నాయి.

Viral video: బంగారు నగల మూటతో పారిపోతున్న దొంగలు.. అడ్డుకున్న పోలీసు.. సినిమా సీన్‌ను తలదన్నేలా..


స్నేహితురాలి పుట్టిన రోజు పార్టీకి వెళ్లిన మహిళ.. రాత్రి వచ్చి గదిలో నిద్రపోయింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. ఉదయం లేచి చూడగా ఆమె ఒంటిపై మొత్తం దద్దుర్లు ఉండడంతో పాటూ ఒళ్లంతా దురదపెట్టింది. సడన్‌గా ఇలా జరగడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. షాక్ నుంచి తేరుకున్న తర్వాత ఆమె తన బెడ్ మొత్తం పరిశీలించింది. లోపల పెద్ద మొత్తంలో నల్లులు (bedbugs) ఉండడాన్ని చూసి ఖంగుతింది.

Viral video: ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే.. పడగ విప్పిన పాముకు ముద్దులు పెట్టిన కుక్కపిల్ల.. చివరకు..


women-viral.jpg

నల్లులను చూడగానే వెంటనే ఆమె హోటల్ యాజమాన్యం వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. తనతో వేల రూపాయలు తీసుకుని, ఇలా నల్లులు ఉన్న గదిని కేటాయిస్తారా.. అంటూ మండిపడింది. దీనిపై హోటల్ యాజమాన్యం బాధితురాలికి క్షమాపణలు తెలియజేసింది. అలాగే నష్టపరిహారం కింద రూ.8,787లు చెల్లించింది. కాగా, తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని వివరిస్తూ సదరు మహిళ.. ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral video: పట్టుకోబోతుండగా కాటేసిన పాము.. అయినా భయపడని స్నేక్ క్యాచర్.. చివరకు..

Updated Date - Jun 11 , 2024 | 09:13 PM