Share News

Optical illusion: ఈ రెండు చిత్రాల మధ్య దాగి ఉన్న.. 3 తేడాలను గుర్తించండి చూద్దాం..

ABN , Publish Date - Jul 07 , 2024 | 08:06 PM

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని నెటిజన్లకు తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. కొన్ని పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు...

Optical illusion: ఈ రెండు చిత్రాల మధ్య దాగి ఉన్న.. 3 తేడాలను గుర్తించండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని నెటిజన్లకు తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. కొన్ని పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు నెటిజన్లు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కాలక్షేపం అవడంతో పాటూ మెదడుకు వ్యాయామం కూడా అందుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా మీకోసం ఓ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో కనుక్కునేందుకు ప్రయత్నంచండి.


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ పాప టేబుల్ వద్ద కూర్చుని పేపర్ ముక్కను పట్టుకుని చూస్తుంటుంది. ఆమెకు ఎదురుగా సాస్‌లో టీ కప్పు ఉంటుంది. అలాగే అదే టేబుల్‌పై ఓ ఫ్లవర్‌వాజ్ కూడా ఉంటుంది.

Viral Video: నొప్పి లేకుండా రక్తం తీయడం ఇప్పుడు యమఈజీ.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్..


అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే మీ కంటికి ఓ పరీక్ష పెడుతున్నాం. ఈ రెండు చిత్రాలను చూస్తే ఒకేలా అనిపిస్తున్నా.. ఇందులో మొత్తం 3 తేడాలు (3 differences) ఉన్నాయి. అయితే వాటిని కనుకకోవడం అంత ఈజీ ఏమీ కాదు. అయితే కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం ఆ తేడాలను గుర్తించడం చాలా సులభం. చాలా మంది ఆ తేడాలను కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Viral Video: గాఢనిద్రలో ఉన్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరకు..


అయితే కొందరు మాత్రమే ఆ తేడాలను గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు తేడాలను గుర్తించి, ఆ కొంతమందిలో మీరూ ఉండేందుకు ప్రయత్నించండి. ఎంత ప్రయత్నించినా ఆ తేడాలను గుర్తించడం మీ వల్ల కాకుంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion.jpg

Viral Video: ఫస్ట్ నైట్ రోజు కొత్త జంట విచిత్ర నిర్వాకం.. ఫోన్ కెమెరా ఆన్ చేసి మరీ..

Updated Date - Jul 07 , 2024 | 08:06 PM