Viral Video: వర్షంలో మేడపైకి వెళ్లిన ప్రేమికులు.. ఎవరూ చూడలేదనుకుని..
ABN , Publish Date - Jul 05 , 2024 | 09:28 PM
ప్రస్తుత సమాజంలో ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరైతే జనాల మధ్యలో మరీ దారుణంగా, అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి...
ప్రస్తుత సమాజంలో ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరైతే జనాల మధ్యలో మరీ దారుణంగా, అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వర్షం పడుతుండగా ఓ ప్రేమ జంట మేడ పైకి వెళ్లింది. ఎవరూ చూడలేదనుకుని ముద్దులు పెట్టుకూంటూ గడిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షం (heavy rain) పడుతున్న సమయంలో ఓ యువతి మేడపైకి వెళ్లింది. వర్షంలో ఎంజాయ్ చేస్తుండగా.. అదే సమయంలో ఆమె ప్రేమికుడు కూడా పక్కనే ఉన్న ఇంటి మేడపైకి వచ్చేశాడు. అతన్ని చూడగానే సినిమా సీన్ తరహాలో అతడి వద్దకు వెళ్తుంది. మధ్యలో ఉన్న గోడపైకి (Lovers kiss) ఎక్కి మరీ తన ప్రియుడికి ముద్దులు పెడుతుంది.
ఇలా ప్రేమికులు ఇద్దరూ చాలా సేపు వర్షంలో తడుస్తూనే ముద్దులు పెట్టుకుంటూ సరసాలాడుతుంటారు. ఈ ఘటనను దూరం నుంచి చూసిన వారు షాక్ అయ్యారు. తమ ఫోన్లలో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రోజురోజుకూ మరీ దారుణంగా తయారువుతున్నారు’’.. అంటూ కొందరు, ‘‘వర్షంలో ఇవేం పాడు పనులు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: జలపాతం వద్ద యువకుడికి షాకింగ్ అనుభవం.. కంగారుగా బయటికి వచ్చి ప్యాంట్‌లో చూసుకోగా..