Share News

Viral Video: మెట్రోలో ప్రయాణికులు డిష్యూం డిష్యూం.. ఎందుకంటే..

ABN , Publish Date - Jul 10 , 2024 | 08:34 PM

బెంగుళూరు అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో కర్ణాటక ఓటరు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. ఆ క్రమంలో ఎన్నికల హామీల్లో భాగంగా.. మహిళలకు ఉచిత ప్రయాణ పధకాన్ని ప్రారంభించింది.

Viral Video: మెట్రోలో ప్రయాణికులు డిష్యూం డిష్యూం.. ఎందుకంటే..

బెంగుళూరు అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో కర్ణాటక ఓటరు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. ఆ క్రమంలో ఎన్నికల హామీల్లో భాగంగా.. మహిళలకు ఉచిత ప్రయాణ పధకాన్ని ప్రారంభించింది. దాంతో మహిళమణులు బస్సుల్లో పోటెత్తారు. దీంతో బస్సు సీటు కోసం ఎంపీ, ఎమ్మెల్యే సీటు కోసం అన్నట్లుగా ఇద్దరు మహిళలు తిట్టుకుని, కొట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో రివ్వూన దూసుకు పోయింది. ఆ ఘటన మరవక ముందే.. తాజాగా బెంగుళూరు మెట్రోలో ఇద్దరు ప్రయాణికులు ఘర్షణ పడిన వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది.

Also Read: Rs. 84 Crores: 108 కేజీల బంగారం సీజ్.. ఎక్కడంటే..?

Also Read: Pooja Khedkar : ట్రైయినీ ఐఏఎస్‌పై బదిలీ వేటు..


తాజాగా బెంగుళూరు మెట్రోలో ఇద్దరు ప్రయాణికులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆ క్రమంలో కన్నడంలో బండ బూతులు సైతం తిట్టుకున్నారు. ఆ పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు వారిని వారించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ తతంగాన్ని అదే మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న సహచర ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదిలిడు. అంతే.. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.

Also Read: Minister Savitha: టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి

Also Read: Ganta Srinivas Rao: సీఎం దృష్టికి గురుకుల సమస్యలు


మరి వారి మధ్య ఇంతలా ఘర్షణకు దారి తీసిన వైనం అయితే బయటకు తెలియ రాలేదు. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. మెట్రోలో చాలా మంది ప్రయాణికులు.. తమ వీపునకు బ్యాగ్‌ తగిలించుకుని ప్రయాణం చేస్తారని వారు గుర్తు చేశారు. ఆ క్రమంలో మెట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉన్నప్పుడు ఇది ఇబ్బందికర పరిణామంగా మారుతుందన్నారు. దీంతో ఈ ఘర్షణ చోటు చేసుకుని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

Also Read: Minister Savitha: టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి

Also Read: Delhi: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణన్


మెట్రో రైళ్ల కోచ్‌ల్లో పలు సమస్యాత్మక అంశాలుంటాయని.. వాటిలో నీటి కొరత, విద్యుత్ సరఫరా, ప్రయాణికులతో కిక్కిరిసిపోవడం తదితర అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. అయినా బెంగుళూరు మెట్రోను మాత్రం ఆ భగవంతుడు కూడా రక్షించలేడని వారు స్పష్టం చేశారు. ఇంకొకరు అయితే.. పబ్లిక్ ప్లేస్‌లో ప్రయాణికులు ఇలా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు. మరోకరు అయితే ఈ నగరం చాలా అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. మరికొందరు అయితే ముంబైలోని లోకల్ రైళ్లలో ఇటువంటి ఘటనలు తరచు జరుగుతాయని.. ఇది చాలా సామాన్యమైన విషయమని స్పష్టం చేశారు. ఈ తరహా ఘటన గతేడాది ఢిల్లీ మెట్రో రైల్లో తాము వీక్షించామని ఇంకో నెటజన్ కామెంట్ చేశాడు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 08:38 PM