Viral: బాబోయ్.. ఇదెక్కడి వ్యాధి.. నిద్రలోనే షాపింగ్ చేసే డిజార్డర్.. యూకే మహిళ వింత జబ్బు వల్ల ఎంత నష్టమంటే..
ABN , Publish Date - Jun 09 , 2024 | 10:30 AM
సాధారణంగా చాలా మంది మహిళలు షాపింగ్ అంటే ఇష్టపడతారు. గంటలు గంటలు షాపింగ్ మాల్స్‌లో గడిపి తమకు నచ్చిన వస్తువులను కొంటుంటారు. ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక ఇంటి నుంచే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఏదైన వస్తువు నచ్చిందంటే ఎలాగైనా దాన్ని కొనెయ్యాలని పరితపిస్తుంటారు.
సాధారణంగా చాలా మంది మహిళలు షాపింగ్ (Shopping) అంటే ఇష్టపడతారు. గంటలు గంటలు షాపింగ్ మాల్స్‌లో గడిపి తమకు నచ్చిన వస్తువులను కొంటుంటారు. ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక ఇంటి నుంచే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఏదైన వస్తువు నచ్చిందంటే ఎలాగైనా దాన్ని కొనెయ్యాలని పరితపిస్తుంటారు. అయితే మెలకువగా ఉన్నప్పుడే కాదు.. నిద్రలో కూడా షాపింగ్ చేయడం గురించి మీరు విన్నారా? (Shopping while Sleeping) యూకే మహిళ అలాంటి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది (Viral News).
బ్రిటన్ (Britain)కు చెందిన 42 ఏళ్ల కెల్లీ నైప్స్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమె నిద్రలో ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండానే షాపింగ్ చేసేస్తోంది. దీనిని వైద్య పరిభాషలో పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్‌గా పిలుస్తారట (parasomnia). ఈ డిజార్డర్ కారణంగా ఆమె నిద్రలో ఉండగానే షాపింగ్ చేసేస్తుందట. అంటే అర్ధరాత్రి లేచి తన ప్రమేయం లేకుండానే ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంది. ఉదయం నిద్ర లేచే సరికి ఆమెకు ఏదీ గుర్తు ఉండదు. అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాకే అసలు విషయం తెలుస్తుందట. ఇలా అమె తనకు తెలియకుండానే రూ.3 లక్షలకు పైగా షాపింగ్ చేసేసిందట.
అంతేకాదు, ఆమె ఒకసారి తన క్రెడిట్ కార్డు వివరాలను ఫోన్‌లో ఎంటర్ చేసినపుడు సైబర్ నేరగాళ్లు రూ.20 వేలు తస్కరించారట. ఈ వ్యాధి వల్ల తాను అప్పుల పాలవుతున్నానని కెల్లీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు నిద్రలోనే నడవడం, మాట్లాడడం, తినడం వంటివి చేస్తుంటారు. ఆ సమయంలో వారి మెదడు పాక్షికంగానే మేల్కొని ఉంటుంది. ఈ డిజార్డర్‌కు చికిత్స లేదట. చుట్టు పక్కల ఉండే వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరే దారీ లేదట.
ఇవి కూాడా చదవండి..
Viral Video: బ్రెజిల్‌లోనే ఇలాంటివి సాధ్యం.. నడిరోడ్డుపై భారీ కొండ చిలువ ఎలా వెళ్తోందో చూడండి..!
Optical Illusion: ఈ ఫొటోలో విభిన్నమైన జంట ఏదో కనిపెడితే మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..