Viral: కొందరు ఫారినర్లకు భారత్ అంటే ఎప్పుడూ చిన్న చూపే.. షాకింగ్ వీడియో.. భారతీయుల ఆగ్రహం
ABN , Publish Date - Mar 22 , 2024 | 08:24 PM
భారత పర్యటనకు వచ్చిన ఓ అమెరికా యువతి చేసిన పని భారతీయ నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటనకు వచ్చిన ఓ అమెరికా యువతి చేసిన పని భారతీయ నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. కొందరు ఫారినర్లకు భారత్ అంటే ఎప్పుడూ చిన్న చూపే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది.
టారా కటిమ్స్ అనే అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇటీవల ఢిల్లీ, ముంబైల్లో పర్యటించింది. తన పర్యటన తాలూకు వీడియోను నెట్టింట అప్‌లోడ్ చేసింది. అయితే, తన వీడియో వైరల్ అయ్యేలా భారత్‌లోని పేదరికాన్ని హైలైట్ చేసి విమర్శల పాలైంది. తొలుత ఢిల్లీ గురించి చెప్పిన ఆమె నగరంలో కాలుష్యం ఎక్కువగా ఉందని వాపోయింది. మహిళలకు వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో టాక్సీల్లో ఎమర్జెన్సీ బటన్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది.
Viral: లీవ్ కావాలంటూ కంపెనీ సీఈఓ వద్దకు వెళ్లిన కొత్త ఉద్యోగి.. చివరకు జరిగిందేంటో చూస్తే..
దక్షిణ ఢిల్లీ ఫారినర్లు ఉండటానికి అనువైనదని చెప్పింది. ఇక్కడ ఖర్చులన్నీ అందుబాటులోనే ఉన్నాయని ప్రశంసించింది. ఆ తరువాత ఆగ్రా కేరళ గురించి కూడా చెప్పింది. చివరగా ముంబై గురించి మాట్లాడుతూ తనకు ఆతిథ్యమిచ్చిన వారిని ప్రశంసించింది. అయితే, ముంబై గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే స్లమ్స్‌లో (Mumbai Slums) పర్యటించాలని చెప్పుకొచ్చింది (US influencer Criticized for Highlighting slums in her tour Video).
ఆమె చెప్పిందంతా బాగానే ఉన్నా ముంబైలోని మురికివాడల గురించి ప్రముఖంగా ప్రస్తావించడం నెటిజన్లకు అస్సలు రుచించలేదు. దేశంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలు, వింతలు, విశేషాలు అనేకం ఉండగా బీదసాదలను హైలైట్ చేసేందుకే ఇష్టపడతారని మండిపడ్డారు. భారత్‌లో పేదరికం గురించి ఇంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించారు. వాస్తవానికి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఎవరి సహాయం అవసరం లేదని అన్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి