Share News

Viral: పెంపుడు జంతువులకూ స్పెషల్ ఛానల్.. మిలియనీర్ గా మారిన యూట్యూబర్..

ABN , Publish Date - Jan 30 , 2024 | 04:06 PM

పెంపుడు కుక్కలు, పిల్లులు వినేలా పాటలు తయారు చేస్తూ యూట్యూబ్ ద్వారా అమన్ అహ్మద్ అనే అమెరికన్ యువకుడు భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

Viral: పెంపుడు జంతువులకూ స్పెషల్ ఛానల్.. మిలియనీర్ గా మారిన యూట్యూబర్..

పెంపుడు కుక్కలు, పిల్లులు వినేలా పాటలు తయారు చేస్తూ యూట్యూబ్ ద్వారా అమన్ అహ్మద్ అనే అమెరికన్ యువకుడు భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. 32 ఏళ్ల అమన్ కు రిలాక్స్ మై డాగ్, రిలాక్స్ మై క్యాట్ అనే రెండు ఛానళ్లను నిర్వహిస్తున్నాడు. వీటికి 28.7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీడియోలు 100 కోట్లకు పైగా వ్యూస్ సాధించాయి. జంతువుల కోసం ఏమైనా చేయాలని భావించిన అమన్ మ్యూజిక్ వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. ఈ సంగీతం జంతువులకు ఎంతో రిలాగ్జేషన్ ఇచ్చింది. ఆ మ్యూజిక్ వింటూ కుక్కలు, పిల్లులు హాయిగా నిద్రపోయేవి. నిద్రలేమితో బాధపడేవారి కోసం కొత్త మ్యూజిక్ ను రూపొందించాలని అమన్ భావించాడు. కానీ తన స్నేహితుడి కామెంట్ తో పెంపుడు జంతువుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ తయారు చేసినట్లు అమన్ తెలిపాడు.

కొవిడ్ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేశారు. దాంతో ఇంట్లోని పెంపుడు జంతువులు కుటుంబసభ్యులతో కలిసి ఉండేవి. కొవిడ్ వేవ్ దాటిన తర్వాత ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడం స్టార్ట్ చేశారు. ఇది పెంపుడు జంతువుల ప్రవర్తనలో మార్పులకు దారితీసింది. వాటిని కుటుంబసభ్యుల నుంచి వేరు చేయవలసి రావడంతో వాటిలో అనేక అసాధారణతలు కనిపించాయి. కొన్ని డిప్రెషన్‌కు లోనైతే మరికొన్ని హింసాత్మకంగా మారాయి. దీంతో వీటిని శాంతింపజేయడానికి అమన్ అహ్మద్ యూట్యూబ్‌లో ఈ సరికొత్త ప్రయోగం చేశాడు.


మొదటి ప్రయత్నంలో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కున్నామన్న అమన్ తాము రూపొందించిన చేసిన కొన్ని ట్రాక్‌లు పని చేశాయని మరికొన్ని పని చేయలేదని చెప్పారు. దీంతో అమన్ స్వయంగా మ్యూజిక్ ఫర్ పెట్స్ అనే కంపెనీని స్థాపించారు. నేడు వందలాది పెంపుడు జంతువుల యజమానులు అమన్ అహ్మద్ కంపెనీ, యూట్యూబ్ ఛానళ్లను ఇష్టపడుతున్నారు. నెలకు చందా కేవలం $5 మాత్రమే కావడం విశేషం. ఇలా వచ్చే వారి సంఖ్య పెరగడంతో అమన్ లక్షలు సంపాదిస్తూ మిలియనీర్ గా మారారు.

"మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 30 , 2024 | 04:07 PM