Viral: బాయ్‌ఫ్రెండ్ బలవంతం చేస్తే లాటరీ టిక్కెట్ కొన్న మహిళ! చివరకు..
ABN , Publish Date - Apr 26 , 2024 | 08:48 PM
బాయ్‌ఫ్రెండ్ బలవంతం చేస్తే లాటరీ టిక్కెట్ కొన్న ఓ మహిళకు ఏకంగా జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఆమె దాదాపు రూ.41 లక్షలు (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) గెలుచుకుంది. అమెరికాలోని (USA) మేరీల్యాండ్ రాష్ట్రంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: బాయ్‌ఫ్రెండ్ బలవంతం చేస్తే లాటరీ టిక్కెట్ కొన్న ఓ మహిళకు ఏకంగా జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఆమె దాదాపు రూ.41 లక్షలు (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) గెలుచుకుంది. అమెరికాలోని (USA) మేరీల్యాండ్ రాష్ట్రంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం ఇది తెగ వైరల్ (Viral) అవుతోంది.
రాష్ట్రంలోని ఓన్లీ ప్రాంతానికి చెందిన మహిళ లారెల్ ప్రాంతంలోని వీస్ మార్కెట్స్‌లో 10 డాలర్లు పెట్టి క్విక్ పిక్ టిక్కెట్ కొంది. ఏప్రిల్ 20న తీసే లాటరీ డ్రా కోసం బాయ్‌ఫ్రెండ్ బలవంతం చేయడంతో ఆమె టిక్కెట్ కొనుగులు చేసింది. ఆ తరువాత దాన్ని పర్సులోనే పెట్టుకున్న మహిళ ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోయింది. తాజాగా ఆమెకు మళ్లీ అది గుర్తుకు రావడంతో ఆమె తన ఆఫీసు పని ముగించుకుని ఇంటికొచ్చింది.
ఆ తరువాత ఇంట్లో మహిళ బాయ్‌ఫ్రెండ్ ఆమె టిక్కెట్‌ను స్క్రాచ్ చేసి ఆ నెంబర్‌ను మేరీ ల్యాండ్ లాటరీ యాప్‌తో స్కాన్ చేశాడు. దీంతో, ఆమె లాటరీ గెలుచుకున్నట్టు తేలింది. ఆ జంట సంబరం అబంబరాన్నంటింది. లాటరీ గెలిచినట్టు తొలుత నమ్మలేకపోయిన ఆ జంట పలుమార్లు తమ టిక్కెట్‌ను స్కాన్ చేసి చూసుకున్నారు (US Woman Hits 41 Lakh Jackpot After Boyfriends Lottery Ticket Advice).
Viral Video: విమానంలో ఎయిర్ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్!
‘‘లాటరీ దక్కిన విషయం తెలిసి నేను సంబరం పట్టలేక పెద్ద పెట్టున అరిచా. మా ఇరుగుపొరుగు వారికి వినబడేంత రేంజ్‌లో అరిచా. నా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. లాటరీ తగులుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఏదో సరదా కోసం ఆడేదాన్ని’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
మహిళ తన లాటరీ డబ్బుతో ఏం చేయబోతోందో ఇంకా నిర్ణయించుకోలేదని ఆమె బాయ్‌ఫ్రెండ్ తెలిపాడు. అయితే, కొంత మొత్తాన్ని ఆమె తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టొచ్చని తెలిపాడు.
అమెరికాలో గతంలోనూ అనేక మంది లాటరీలో భారీగా సొమ్ము గెలుచుకున్నారు. గతేడాది న్యూజెర్సీకి చెందిన ఓ వ్యక్తి మెగా మిలియన్స్ జాక్‌పాట్ లాటరీలో ఏకంగా 1.13 బిలియన్ డాలర్లు (రూ. 9,425 కోట్లు) గెలుచుకున్నాడు. మెగామిలియన్స్ లాటరీలో గెలిచిన ఐదో అతిపెద్ద మొత్తం ఇదేనని సంస్థ తెలిపింది. అతడి టిక్కెట్‌పై ఉన్న ఆరు సంఖ్యలూ జాక్‌పాట్ నెంబర్‌తో సరిపోలాయని పేర్కొంది. అయితే, ఈ మొత్తం అమెరికా లాటరీ చరిత్రలోనే ఎనిమిదో అతి పెద్ద మొత్తమని కూడా స్థానిక మీడియా పేర్కొంది.