Viral: జాబ్‌కు రాజీనామా.. చివరి రోజున బాస్‌కు ఎలాంటి ఝలక్ ఇచ్చాడో చూస్తే..
ABN , Publish Date - Apr 26 , 2024 | 06:51 PM
బాస్ తనతో వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన ఓ ఉద్యోగి చివరకు తన జాబ్‌కు రాజీనామా చేశాడు. చివరి రోజున పీడ విరగడైందంటూ బాస్ ముందు నిలబడి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నె్ట్ డెస్క్: బాస్ తనతో వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన ఓ ఉద్యోగి చివరకు తన జాబ్‌కు రాజీనామా చేశాడు. అంతేకాకుండా, చివరి రోజున బాస్‌కు ఊహించని ఝలక్ కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. పూణెలో ఈ ఘటన వెలుగు చూసింది.
తన ఫ్రెండ్, ఫాలోవర్ అయిన అంకిత్ ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజున బాస్‌కు ఎలా ఝలకిచ్చిందీ చెబుతూ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ అనీశ్ భగత్ ఓ వీడియో షేర్ చేశాడు. అంకిత్ ఓ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడని తెలిపాడు. అయితే, బాస్ తీరుతో అంకిత్ విసిగిపోయాడని చెప్పాడు. బాస్ తనకు సరిగా గౌరవం ఇచ్చేవాడు కాదని అంకిత్ పేర్కొన్నాడు. జీతం మాత్రం సరిగ్గా పెంచేవాడు కాదని తెలిపాడు. ఈ విషపూరిత వాతావరణంలో పనిచేయలేక రాజీనామా చేసేందుకు అంకిత్ సిద్ధమయ్యాడు (Pune man quits job celebrates last day at work with dhols outside office).
Viral: ఏనుగుల మధ్య ఇలాంటి రిలేషన్ ఉంటుందా? చాలా మందికి తెలియని విషయం ఇది!
ఉద్యోగంలో చివరి రోజున అంకిత్ తన ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ రాజీనామా పత్రం ఇచ్చేశాక బయటకు వచ్చాడు. బాస్ కూడా బయటకు వచ్చేంతవరకూ వేచి చూశాడు. అంతకుమునుపే తన ఫ్రెండ్స్ సాయంతో ఓ బ్యాండ్‌ను కూడా ఏర్పాటు చేశాడు. ఇక బాస్ అఫీసులోంచి బయటకు రాగానే అంకిత్ అతడి వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించాడు. ఏం జరుగుతోందో బాస్ అర్థం చేసుకునేలోపే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు.
మానసిక క్షోభకు గురి చేస్తున్న ఉద్యోగం వదిలిపోయినందుకు సంబరాన్ని వ్యక్తపరుస్తూ డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. మరోవైపు, అతడి స్నేహితులు వచ్చి రకరకాల వాయిద్యాలు వాయిస్తూ అతడిని ప్రోత్సహించారు. ఇదంతా చూసి విసిగిపోయిన బాస్ వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గద్దించాడు. వీడియోలో ఇదంతా చూసిన జనాలు పడీ పడీ నవ్వుకున్నారు. తమకూ ఇలాగే స్టైల్‌గా రాజీనామా చేయాలని వ్యాఖ్యానించారు.