Gautam Adani Love Story: అతనొద్దని రిజెక్ట్ చేసిందట.. గౌతమ్ అదానీ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ..!
ABN , Publish Date - Feb 12 , 2024 | 07:42 PM
Gautam Adani Love Story: ప్రేమలో పడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. యుక్త వయసులో చాలా మంది ప్రేమలో మునిగిపోతారు. సమయం కూడా తెలియనంతగా ప్రేయసి, ప్రియుడితో కబుర్లలో తేలిపోతారు. ఆ ప్రేమ ఫలించి వివాహ బంధంతో ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉంటే అంతకంటే సంతోషం ఆ ప్రేమ జంటకు మరోటి ఉండదు. అయితే, నేటి కాలంలో ప్రేమలో పడిన యువతీ యువకులు పెళ్లితో ఒక్కటైన దాఖలాలు చాలా తక్కువే అని చెప్పాలి.
Gautam Adani Love Story: ప్రేమలో పడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. యుక్త వయసులో చాలా మంది ప్రేమలో మునిగిపోతారు. సమయం కూడా తెలియనంతగా ప్రేయసి, ప్రియుడితో కబుర్లలో తేలిపోతారు. ఆ ప్రేమ ఫలించి వివాహ బంధంతో ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉంటే అంతకంటే సంతోషం ఆ ప్రేమ జంటకు మరోటి ఉండదు. అయితే, నేటి కాలంలో ప్రేమలో పడిన యువతీ యువకులు పెళ్లితో ఒక్కటైన దాఖలాలు చాలా తక్కువే అని చెప్పాలి. కులం, మతం, ఆర్థిక పరమైన అంశాలు, కుటుంబ వ్యవహారాలు, పరువు తదితర కారణాల చేత చాలా ప్రేమ కథలు మధ్యలోనే సమాధి అయిపోతున్నాయి. ఇక ప్రేమికులకు ఫిబ్రవరి వచ్చిందంటే పండుగే.. వాలెంటైన్స్ వీక్‌లో ఒక్కో రోజును ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. మన దేశంలో ఎంతో మంది ప్రముఖులు ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ - అంజలి, ధోని - సాక్షి, విరాట్ కోహ్లీ - అనుష్క షర్మ మాదిరిగానే.. దేశంలోనే టాప్ బిజినెస్‌మెన్ గౌతమ్ అదానీ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇవాళ మనం గౌతమ్ అదానికి సంబంధించిన లవ్ సీక్రెట్స్ తెలుసుకుందాం.
భారత వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ ప్రేమకథ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. గౌతమ్ అదానీకి అతిపెద్ద సపోర్ట్ ఎవరంటే ఆయన భార్యే అంటారు. కానీ, ఆమె పెళ్లికి ముందు గౌతమ్ అదానీని రిజెక్ట్ చేశారట. ఆయన్ని ఇష్టపడలేదట. ఈ విషయాన్ని ఆర్ఎన్ భాస్కర్ రాసిన 'గౌతమ్ అదానీ: రీఇమేజినింగ్ బిజినెస్ ఇన్ ఇండియా' పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం గౌతమ్ అదానీ ప్రేమ, పెళ్లి వివరాలు తెలుసుకుందాం..
ప్రీతి అదానీకి గౌతమ్ అదానీ నచ్చలేదు..
పెళ్లికి ముందు ప్రీతికి గౌతమ్ అదానీ నచ్చలేదట. ఆయనను చూడకుండానే అతనితో పెళ్లి వొద్దని చెప్పేసిందట. వాస్తవానికి ప్రీతి తండ్రి సేవాంతిలాల్ ఆమెను గౌతమ్ అదానీకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. కానీ, ఆ సమయంలో గౌతమ్ అదానీ కనీసం గ్రాడ్యూయేషన్ కూడా కంప్లీట్ చేయలేదట. ప్రీతి మాత్రం డెంటిస్ట్ చదువుతోంది. అందుకని.. గౌతమ్ అదానీ తనకు నచ్చలేదని, అతను తనకు సరికాదని భావించిందట.
తండ్రి సలహాతో గౌతమ్ అదానీని కలిసిన ప్రీతి..
అయితే, ప్రీతి తండ్రి సేవాంతీలాల్.. గౌతమ్ అదానీకి గురించి ఆమెకు వివరించి, ఒప్పించాడట. ఒకసారి కలిసి మాట్లాడాలని సూచించాడట. తండ్రి మాటను కాదనలేక.. తొలిసారి గౌతమ్ అదానీని ప్రీతి కలిశారు. ఆ తరువాత ఒకరితో ఒకరు తరచుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో.. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆ తరువాత గౌతమ్ అదానీకి, ప్రీతికి 1 మే 1986న పెళ్లి జరిగింది.
పెళ్లి తరువాత గౌతమ్ అదానీ, ప్రీతి జీవితం..
పెళ్లి వరకు బాగానే ఉంది కానీ.. పెళ్లి తరువాతే అసలు కష్టాలు ఎదురయ్యాయట. గౌతమ్ అదానీ పని కోసం చాలాకాలం వేరే ప్రాంతానికి వెళ్లాడట. ఆ తరువాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం చకచకా జరిగిపోయాయి. అయితే, సమయం దొరికినప్పుడల్లా గౌతమ్ అదానీ తన కుటుంబ సభ్యులతోనే గడిపేవాడు. గౌతమ్ అదానీ తన పనిని తాను పూర్తి చేయడంతో పాటు.. కుటుంబానికి కూడా అవసరమైన సమయం కేటాయిస్తారని, ఆయనకు సమపాలన సరిగ్గా తెలుసునని ప్రీతి అదానీ చెప్పారు.
36 ఏళ్ల బంధం..
ప్రీతి అదానీ, గౌతమ్ అదానీ వివాహం 36 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేటికీ వారి మధ్య అదే స్థాయిలో ప్రేమ ఉంది. ఇటీవల, గౌతమ్ అదానీ 60వ పుట్టినరోజు సందర్భంగా, అతని పాత ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి, '36 సంవత్సరాల క్రితం, నేను నా కెరీర్‌ను వదిలి గౌతమ్ అదానీతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వ్యక్తి పట్ల నాకు ఎనలేని గౌరవం, గర్వం. ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన కలలన్నీ నెరవేరాలని ప్రార్థిస్తున్నాను.’ అంటూ పోస్ట్ చేశారు ప్రీతి అదానీ.
100 బిలియన్ల క్లబ్‌లోకి అదానీ..
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను చాటుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల నికర విలువ సుమారు 101 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ వ్యాపార రంగంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. ముఖేష్ అంబానీ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచారు.