Share News

Viral Video: మొసలి, కొండచిలువ మధ్య భీకరపోరు.. చివరికి ఇదీ పరిస్థితి..

ABN , Publish Date - Sep 19 , 2024 | 01:12 PM

Viral Video: ఇంట్లోని వారంతా ప్రశాంతంగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇంతలో పెరట్లో ఏదో శబ్ధం వస్తోంది. మొదట లైట్ తీసుకున్నా.. ఆ తరువాత కూడా ఇవే శబ్ధాలు కంటిన్యూ అయ్యాయి. దీంతో ఏం జరుగుతుందా అని బయటకు వెళ్లి చూశారు. కళ్ల ముందు ఉన్న దృశ్యాన్ని చూసి వారంతా షాక్.. మరి ఇంతకీ ఏమైంది.. ఈ కథనంలో చూసేయండి..

Viral Video: మొసలి, కొండచిలువ మధ్య భీకరపోరు.. చివరికి ఇదీ పరిస్థితి..
Viral Video

Viral Video: ఈ భూప్రపంచంలో స్వయంపోషకాలు, పర్నాజీవులు ఉంటాయి. స్వయం పోషకాలు అంటే తమ ఆహారాన్ని తామే తయారుచేసుకుని జీవిస్తాయి. పరాన్నజీవులు.. ఇతర జీవరాశులపై ఆధారపడి ఉంటాయి. అంటే.. ఇతర జీవాలను తింటూ తమ ఆకలిని తీర్చుకుంటాయి. అందుకే.. పరాన్న జీవుల మధ్య పోరు నడుస్తుంటుంది. చిన్న జీవిని పెద్ద జీవి తినడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. అడవి ప్రపంచంలో.. రకరకాల జంతువులు, సరిసృపాలు జీవిస్తుంటాయి. వాటి మధ్య నిత్యం సంఘర్షణే ఉంటుంది. తాజగా ఓ మొసలి, కొండ చిలువ మధ్య భీకరమైన పోరు జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


ఓ ఇంటి పెరట్లోకి మొసలి, కొండ చిలువ వచ్చాయి. కాంపౌండ్‌ వాల్‌ పక్కనే వాటర్ పాండ్ ఉంది. దాని పక్కనే ఈ రెండు ఒకదానికొకటి తారసపడ్డాయి. ఇంకేముంది.. రెండింటి మధ్య ఫైటింగ్ మొదలైంది. మొసలి తన పదునైన దంతాలతో కొండచిలువను కొరికే ప్రయత్నం చేస్తుండగా.. కొండచిలువ ఆ మొసలిని చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసే ప్రయత్నం చేసింది. ఇలా రెండింటి మధ్య చాలా సమయం భీకర పోరు జరిగింది. కానీ, చివరకు కొండచిలువే చిత్తయ్యింది. మొసలి బలం ముందు బేజారయ్యింది. తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. మొసలి అస్సలు వదల్లేదు.


ఈ సన్నివేశాన్ని తమ కెమెరాలో బందించిన ఇంటి యజమాని.. వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అదికాస్తా వైరల్ అయ్యింది. మొసలి, కొండచిలువ మధ్య పోరును చూసి బాబోయ్ అని జడుసుకుంటున్నారు. తమ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెడుతున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.


Also Read:

వైసీపీకి వరుస షాక్‌లు.. మరో ముఖ్య నేత ఔట్..!

ఆ ఆలోచనతోనే దేవర టైటిల్‌ పెట్టాం

పిల్లలను నలుగురిలో తిడితే జరిగేది ఇదే..

For More Viral News and Telugu News..

Updated Date - Sep 19 , 2024 | 01:19 PM