Share News

Viral Video: వామ్మో.. పిల్లలు ఇలా తయారయ్యారేంటి? స్కూటీ పక్కకు తీయాలని చెప్పి కీస్ తీసుకుని ఓ బాలిక ఏం చేసిందో చూడండి..!

ABN , Publish Date - Sep 10 , 2024 | 01:35 PM

సాధారణంగా ఇంటి బయట, రహదారుల పక్కన కారు, బైక్ వంటి వెహికల్స్ పార్క్ చేయడం సహజం. అవి దారికి అడ్డుగా ఉన్నట్టేతై వాటిని అడ్డు తీయమని చెప్పడం చేస్తుంటాం.

Viral Video: వామ్మో..  పిల్లలు ఇలా తయారయ్యారేంటి? స్కూటీ పక్కకు తీయాలని చెప్పి కీస్ తీసుకుని ఓ బాలిక ఏం చేసిందో చూడండి..!

సాధారణంగా ఇంటి బయట, రహదారుల పక్కన కారు, బైక్ వంటి వెహికల్స్ పార్క్ చేయడం సహజం. అవి దారికి అడ్డుగా ఉన్నట్టేతై వాటిని అడ్డు తీయమని చెప్పడం, తెలిసిన వారైతే కీస్ తీసుకుని వాటిని మరొక చోటకు తరలించడం వంటివి చేస్తుంటారు. అయితే తాజాగా వారణాసిలో జరిగిన సంఘటన మాత్రం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. స్కూటీ అడ్డుగా ఉందని దాన్ని పక్కకు పెట్టాలని ఓ స్కూల్ బాలిక ఓ మహిళతో కీస్ ఇప్పించుకుంది. ఆ తరువాత జరిగిన సంఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ సంఘటనకు సంబంధించి పీసీటీవీ పుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..


Packet Milk: ప్యాకెట్ పాలు వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?



మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రం వారణాసి(Varanasi) లోని కబీర్ నగర్ లో ఓ ఫ్లాట్ లో ఓ మహిళ నివసిస్తోంది. స్కూల్ యూనిఫాం లో ఉన్న ఒక అమ్మాయి ఆ మహిళ వద్దకు వచ్చి "స్కూటీ దారికి అడ్డుగా ఉంది, దాన్ని తొలగించి పక్కకు పెట్టాలి. స్కూటీ కీస్ ఇవ్వండి' అని అడిగింది. సదరు మహిళ కూడా ఆ అమ్మాయి స్కూల్ యూనిఫాం చూసి ఆ అమ్మాయికి స్కూటీ కీస్ ఇచ్చింది.


Vitamin-D: విటమిన్-డి పుష్కలంగా లభించాలంటే.. సూర్యకాంతిలో ఏ సమయంలో గడపాలంటే..!



స్కూటీ కీస్ తీసుకున్న ఆ అమ్మాయి స్కూటీని స్టార్ట్ చేసి అటూ ఇటూ చూసి తనను ఎవరూ పరిశీలించడం లేదని నిర్థారించుకుని స్కూటీ ఎక్కి అక్కడి నుండి హాయిగా వెళ్లిపోయింది. ఇలా స్కూల్ యూనిఫాంలో బాలిక చాలా చాకచక్యంగా స్కూటీని దొంగతనం చేసింది. అయితే ఈ సంఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ(CCTV) పుటేజీలో రికార్డవడంతో స్కూటీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు సీసీటీవీ పుటేజీ వీడియో ఆధారంగా ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైపు మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి..

ఖాళీ కడుపుతో అంజీర్ నీరు తాగితే ఏం జరుగుతుందంటే..!

ఏడాదికి ఒకసారి ఈ 6 రకాల రక్త పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యం సేఫ్..!

బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 10 , 2024 | 01:36 PM